త్రిషకు మెగా కోడలి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. అదేంటో తెలుసా? | Upasana sends To actress Trisha to gift Hamper to her | Sakshi
Sakshi News home page

Trisha: త్రిషకు మెగా కోడలి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. అదేంటో తెలుసా?

Jun 3 2026 2:25 PM | Updated on Jun 3 2026 2:53 PM

Upasana sends To actress Trisha to gift Hamper to her

హీరోయిన్ త్రిషకు మెగా ఫ్యామిలీ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన నుంచి ప్రత్యేక బహుమతిని అందుకుంది. అత్తమ్మాస్‌ కిచెన్‌ నుంచి స్పెషల్ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ పొందింది. అత్తమ్మాస్ కిచెన్ నుంచి త్రిషకు ప్రత్యేక గిఫ్ట్ హ్యాంపర్ చేరింది. ఈ విషయాన్ని త్రిష సోషల్ మీడియాలో పంచుకుంది. థ్యాంక్ యూ ఉపాసన.. ది సమ్మర్‌ స్పెషల్ గిఫ్ట్.. అంటూ ఆనందం వ్యక్తం చేసింది.

కాగా.. అత్తమ్మాస్‌ కిచెన్‌ పేరుతో ఉపాసన, చిరంజీవి సతీమణి సురేఖ ఈ వంటకాలు తయారు చేస్తున్నారు. ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంచారు. ఇందులో కేసరి, పొంగల్, ఉప్మా, రసం లాంటి వంటకాలు ఉండనున్నాయి. అత్తమ్మాస్‌ కిచెన్‌లో పులిహోర వంటకం ఎక్కువగా ఫేమస్ అయింది. త్రిషకు పంపిన గిఫ్ట్ హ్యాంపర్‌లో రుచికరమైన ఆవకాయ పచ్చళ్లతో పాటు వివిధ రకాల పొడులు కూడా ఉన్నాయి. దీంతో త్రిష ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

at

ఇక త్రిష విషయానికొస్తే.. విజయ్ సీఎం అయ్యాక ఆమె పేరు మార్మోగిపోతోంది. ఎక్కడ చూసినా వీరిద్దరి గురించే చర్చ నడుస్తోంది. త్వరలోనే త్రిష పెళ్లి చేసుకోనుందని రూమర్స్ కూడా వస్తున్నాయి. వాటన్నింటికీ త్రిష సైతం తనదైన శైలిలో కౌంటర్స్ ఇస్తూనే ఉంది. ఇటీవల నా కుక్కకు మాత్రమే వ్యక్తగత విషయాల్లో అనుమతి ఇస్తానని రూమర్స్‌ను ఉద్దేశించి పోస్ట్ చేసింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement