ఆ రెండింటిని దత్తత తీసుకున్న ఉపాసన.. ఎందుకంటే ? | Upasana Konidela Adopted Two Lions In Nehru Zoological Park | Sakshi
Sakshi News home page

Upasana Konidela : ఆ రెండింటిని దత్తత తీసుకున్న ఉపాసన.. ఎందుకంటే ?

Dec 5 2021 2:44 PM | Updated on Dec 5 2021 2:46 PM

Upasana Konidela Adopted Two Lions In Nehru Zoological Park - Sakshi

Upasana Konidela Adopted Two Lions In Nehru Zoological Park: మెగా కోడలు, మెగా పవర్ స్టార్‌ రామ్‌ చరణ్‌ భార్య ఉపాసన పరిచయం అక్కర్లేని పేరు. రామ్‌ చరణ్‌ భార్యగా, అపొలో అధినేత మనవరాలిగా కాకుండ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అనేక సామాజిక సేవ కార్యక‍్రమాలు చేపడుతూ, నిత్యం సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. సోషల్ మీడియాలో ఫిట్‌నెస్‌, ఆయుర్వేదం, జంతువుల సంరక్షణ గురించి ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తుంటారు. వాటికి సంబంధించిన వీడియోలను సైతం షేర్‌ చేస్తుంటారు. తాజాగా రెండు సింహాలను దత్తత తీసుకున్నారు ఉపాసన. 

హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌లోని విక్కీ, లక్ష్మీ అనే రెండు సింహాలను దత్తత తీసుకున్నారు ఉపాసన కొణిదెల. వాటి సంరంక్షణ బాధ్యతలు, ఆహారపు ఖర్చులను ఏడాదిపాటు చూసుకోనున్నారు. ఇందుకోసం రూ. 2 లక్షల చెక్కును నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌ క్యూరేటర్‌ ఎస్‌. రాజశేఖర్‌కు అందించారు ఉపాసన. పార్కులోని అన్ని జంతువుల సంరక్షణ, మంచి ఆరోగ్య పరిస్థితి తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని ఉపాసన తెలిపారు. క్యూరేటర్‌, అతని బృంద సభ్యులను ఆమె అభినందించారు. జూలో ఉంచిన 2000 జంతువుల ఆరోగ్యాన్ని కాపాడుతున్నారని, వాటి పరిశుభ్రతగా ఉంచడంలో సిబ్బంది అంకితభావంపై ఉపాసన ప్రశంసలు కురిపించారు. 

ఈ సందర్భంగా ఉపాసనకు నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌ క్యూరేటర్‌ ఎస్‌. రాజసేఖర్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఆమెది మంచి మనసు అని కొనియాడారు. వన్యప్రాణుల పరిరక్షణపై వారు చూపించిన నిబద్ధత ఎంతో మందికి స్ఫూర‍్తిదాయకమన్నారు. ఇలా పార్కులోని వన్యప్రాణులను దత్తత తీసుకోవడానికి పౌరులు ముందుకు రావాలని కోరారు. 

ఇదీ చదవండి: ట్రాన్స్‌జెండర్‌ కమ్యునిటీతో ఉపాసన సోదరి పెళ్లి వేడుకలు, ఆశీర్వాదాలు

Advertisement
 
Advertisement
Advertisement