Actress Sreevani: ఘనంగా నటి శ్రీవాణి గృహప్రవేశం వేడుక, నటీనటుల సందడి.. ఫొటో వైరల్‌

Tv Actress Sreevani New House Warming Ceremony Photos Goes Viral - Sakshi

బుల్లితెరపై ఎన్నో సీరియల్స్‌లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది నటి శ్రీవాణి. ఎక్కువగా విలన్‌ పాత్రల్లో నటించి మెప్పించింది. ఓ వైపు నటిగా బిజీగా ఉంటూనే మరోవైపు నెట్టింట అలరిస్తోంది. రీసెంట్‌గా ఆమె తన సొంత యూట్యూబ్‌ చానల్‌ను లాంచ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను, ఇంట్లో జరిగే శుభకార్యలకు సంబంధించిన వీడియోలను తన యూట్యూబ్‌ చానల్లో షేర్‌ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే ఇటీవల ఆమె ఓ కొత్త ప్లాట్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఆ మధ్య తన కొత్త ప్లాట్‌లో జరుగుతున్న వర్క్‌కు సంబంధించిన వీడియోను కూడా షేర్‌ చేసింది.

ఇక తాజాగా ఆమె తన కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేశారు. కొత్త ఇంటి గృహప్రవేశ వేడుకు ఆమె చాలా ఘనంగా నిర్వహించారు. చాలామంది బుల్లితెర నటీనటులు ఈ కార్యక్రమానికి హాజరై సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. బిగ్‌బాస్‌ బ్యూటీ హిమజ, ప్రముఖ సీరియల్‌ నటి సుష్మా, నవీన, అంజలితో పాటు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు శ్రీవాణికి శుభాకాంక్షలు తెలుపుతూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రీవాణి గృహప్రవేశం వేడుకకు సంబంధించిన ఫొటోలను షేర్‌ చేస్తున్నారు. 

చదవండి: 
థియేటర్ల ఇష్యూపై నిర్మాత సి కల్యాణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
షూటింగ్‌లో హీరోయిన్‌కి కారు ప్రమాదం.. ఆలస్యంగా వెలుగులోకి!

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top