Producer C Kalyan Interesting Comments On Theatres Issue - Sakshi
Sakshi News home page

C Kalyan: థియేటర్ల ఇష్యూపై నిర్మాత సి కల్యాణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Dec 9 2022 2:53 PM | Updated on Dec 9 2022 3:33 PM

Producer C Kalyan Interesting Comments On Theatres Issue - Sakshi

థియేటర్ల సమస్యపై తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు, నిర్మాత సి. కల్యాణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేడు శుక్రవారం తన పుట్టినరోజు సందర్భంగా సి. కల్యాణ్‌ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు సినిమాని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తెలుగు సినిమాలకు కాకుండా.. కన్నడ, తమిళ చిత్రాలకు థియేటర్లు ఇవ్వడం సరికాదని, ఇలా చేస్తే బడాస్టార్ల సినిమాలకు కూడా థియేటర్లు దొరక్కపోవచ్చని అభిప్రాయపడ్డారు.

అలా జరిగితే మన పరువు మనమే తీసుకన్న వాళ్లం అవుతామన్నారు. కన్నడ, తమళ్‌లో మొదట వాళ్ల సినిమాలకే ప్రాధాన్యత ఇస్తారని, ఆ తర్వాతే ఇతర భాషల సినిమాలకు థీయేటర్లు ఇస్తారని పేర్కొన్నారు. మనం కూడా మారాలని, డబ్బుకోసం కాకుండా.. సినిమాని బ్రతికించుకోవడం కోసం కష్టపడాలన్నారు. ఈ విషయంలో డైరెక్టర్‌గా చాంబర్‌ ఏం చేయలేదని, గిల్డ్‌ ఉన్నా పెద్దగా ఎలాంటి ఉపయోగం లేదని నిర్మాత సి కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. 

చదవండి: 
షూటింగ్‌లో గాయం, పెను ప్రమాదం నుంచి బయటపడ్డ హీరోయిన్‌
మాల్దీవుల్లో యాంకర్‌ రష్మీ రచ్చ.. వీడియో వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement