ప్రెగ్నెన్సీ ప్రకటించిన ప్రముఖ బుల్లితెర నటి! | TV Actress Ruhi announces pregnancy famous with Kundali Bhagya | Sakshi
Sakshi News home page

TV Actress: పెళ్లయిన ఐదేళ్లకు గుడ్‌ న్యూస్‌.. ప్రెగ్నెన్సీతో బుల్లితెర నటి!

Nov 11 2024 4:41 PM | Updated on Nov 11 2024 5:06 PM

TV Actress Ruhi announces pregnancy famous with Kundali Bhagya

ప్రముఖ బుల్లితెర నటి రుహి చతుర్వేది ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. తాను ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించింది.  కుండలి భాగ్య సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకున్న రుహి చతుర్వేది నటుడు శివేంద్ర ఓం సాయినియోల్‌ను పెళ్లాడింది. ఈ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. తన భర్తతో కలిసి ఓ వీడియోను షేర్ చేసింది. వీరికి పెళ్లయిన ఐదేళ్ల తర్వాత గర్భం ధరించినట్లు వెల్లడించారు.

రుహి చతుర్వేది తన ఇన్‌స్టాలో రాస్తూ..' మా అందమైన కుటుంబం ఇంకాస్త పెద్దగా అవుతోంది. ఈ ఫీలింగ్ చాలా అద్భుతంగా ఉంది' అంటూ పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు బుల్లితెర జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు. కాగా.. రుహి చతుర్వేది, సైనియోల్ కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో 2019లో వివాహం చేసుకున్నారు.

కాగా.. ఆమె కుండలి భాగ్య సీరియల్‌లో షెర్లిన్ ఖురానా పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతకుముందు రుహి మిస్ ఇండియా వరల్డ్‌ వైడ్‌-2010 పోటీల్లోనూ పాల్గొన్నారు. ఆ తర్వాత 2012లో ఆలాప్ అనే సినిమాతో నటనలో ఎంట్రీ ఇచ్చారు. అంతే కాకుండా ఖత్రోన్‌ కే కిలాడీ సీజన్-13లోనూ కంటెస్టెంట్‌గా పాల్గొంది. మరోవైపు ఆమె భర్త శివేంద్ర చోటి సర్దానీ అనే సీరియల్‌లో నటించారు. 

Advertisement
 
Advertisement
Advertisement