సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను పెళ్లాడిన టాలీవుడ్ బుల్లితెర నటి | Tv Actress Manshi Joshi Knot With Software Engineer in Bangalore | Sakshi
Sakshi News home page

Manshi Joshi: పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన దేవత సీరియల్ నటి మాన్షి జోషి

Feb 17 2025 7:10 PM | Updated on Feb 17 2025 7:27 PM

Tv Actress Manshi Joshi Knot With Software Engineer in Bangalore

ప్రముఖ బుల్లితెర నటి మాన్షి జోషి వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. గతేడాది అక్టోబర్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ముద్దుగుమ్మ  సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రాఘవ్‌ను పెళ్లాడింది. బెంగళూరులోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో వీరి పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్లి వేడుకలో సినీతారలు, సన్నిహితులు, స్నేహితులు పెద్ద ఎత్తున హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. తాజాగా తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది ముద్దుగుమ్మ. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సోషల్ మీడియా వేదికగా మాన్షికి అభినందనలు చెబుతున్నారు.

కన్నడలో పలు సీరియల్స్‌లో నటించిన మాన్షి జోషి.. తెలుగులో దేవత అనే సీరియల్‌లో కనిపించింది. ఈ సీరియల్‌లో అర్జున్ అంబటి, చంటిగాడు హీరోయిన్ సుహాసిని కీలక పాత్రల్లో నటించారు. అంతేకాకుండా కన్నడలో పారు సీరియల్‌తో ఫేమ్ తెచ్చుకుంది. రాధ రమణ, అంబుదాన్ ఖుషీ, గీతాంజలి, రాధ రాఘవ్‌ లాంటి సీరియల్స్‌తో మెప్పించింది. 
 

Advertisement
 
Advertisement
Advertisement