
బాలీవుడ్‌లో మరో రీమేక్ రాబోతుంది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా పరిచయమైన 'దఢక్' చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ వస్తోంది. కాకపోతే ఇందులో హీరోహీరోయిన్లతో పాటు స్టోరీ కూడా పూర్తిగా మారిపోయింది. కాకపోతే మెయిన్ పాయింట్ మాత్రం దాదాపు అదే ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇంతకీ ఇది ఏ మూవీకి రీమేక్? ట్రైలర్ ఉందనేది ఇప్పుడు చూద్దాం.
మరాఠీలో వచ్చిన 'సైరాత్' సినిమా అదిరిపోయే హిట్. దాన్ని హిందీలో 'దఢక్' పేరుతో రీమేక్ చేశారు. తక్కువ కులానికి చెందిన ఓ అబ్బాయి.. పై కులానికి చెందిన అమ్మాయితో ప్రేమలో పడతాడు. తర్వాత వీళ్లిద్దరూ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారనేదే ప్లాట్ పాయింట్. ఆ మూవీ హిందీలోనూ హిట్ అయింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ 'దఢక్ 2' తీశారు. ఆగస్టు 1న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: బాలీవుడ్ పరువు తీసిన సంజయ్ దత్!)
ట్రైలర్ చూడగానే అరె ఈ స్టోరీ ఎక్కడో చూసినట్లు ఉందే అనిపించింది. తమిళంలో 2018లో 'పరియరుమ్ పెరుమాళ్' అనే మూవీ వచ్చింది. ఇప్పుడు దీన్నే హిందీలో 'దఢక్ 2' పేరుతో రీమేక్ చేశారు. ఒరిజినల్ ఆర్ట్ ఫిల్మ్ తరహాలో ఉంటుంది. రీమేక్‌కి వచ్చేసరికి మాత్రం కాస్త కమర్షియల్ టచ్ ఇచ్చారనిపిస్తోంది. ఇందులో సిద్ధాంత్ చతుర్వేది తక్కువ కులానికి చెందిన కుర్రాడిగా, 'యానిమల్' ఫేమ్ తృప్తి దిమ్రి పై కులానికి చెందిన అమ్మాయిగా నటించారు.
ట్రైలర్ అయితే చూడటానికి బాగానే ఉంది. హీరోహీరోయిన్లుగా చేసిన సిద్ధాంత్, తృప్తి జంట మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయినట్లు కనిపిస్తుంది. మరి సినిమా ఏ మేరకు క్లిక్ అవుతుందో చూడాలి?
(ఇదీ చదవండి: 56 ఏళ్ల హీరోతో మృణాల్ రొమాన్స్.. ట్రైలర్ రిలీజ్)