'ఇంతకంటే పెద్ద హిట్‌ ఎవరైనా తీయగలరా?'.. టాలీవుడ్ నిర్మాత కామెంట్స్ | Tollywood Producer Naga Vamsi Comments About Lucky Baskhar Success | Sakshi
Sakshi News home page

Naga Vamsi: ఇంత ధైర్యంగా ఎవరైనా స్టేట్‌మెంట్‌ ఇస్తారా?: నాగవంశీ

Nov 1 2024 4:08 PM | Updated on Nov 1 2024 4:22 PM

Tollywood Producer Naga Vamsi Comments About Lucky Baskhar Success

సీతారామం మూవీతో తెలుగులోనూ క్రేజ్ తెచ్చుకున్న హీరో దుల్కర్ సల్మాన్. ఆయన హీరోగా నటించిన చిత్రం లక్కీ భాస్కర్. ఈ సినిమాలో గుంటూరు కారం ఫేమ్ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31 థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మొదటి రోజే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. వసూళ్ల పరంగానూ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.

అయితే ఈ సినిమా రిలీజ్‌కు ముందు మీడియా మిత్రులకు ఆయన పార్టీ ఇస్తానని మాటిచ్చారు. లక్కీ భాస్కర్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ సందర్భంగా నాగవంశీ కామెంట్స్ చేశారు. ఈ సినిమాలో ఒక్క నెగెటివ్ రివ్యూ గానీ.. నెగెటివ్ కామెంట్ కానీ  చూపిస్తే అందరికీ పార్టీ ఇస్తానన్నారు.

తాజాగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌ మీట్‌లో ఈ విషయంపై నిర్మాత నాగవంశీ స్పందించారు. లక్కీ భాస్కర్‌లో ఎవరూ ఒక్క నెగెటివ్ పాయింట్‌ను పట్టుకోలేకపోయారని అన్నారు. ఇంత ధైర్యంగా స్టేట్‌మెంట్‌ ఇచ్చినా కూడా ఎవరూ కూడా చేయలేకపోయారు. ఇంతకంటే పెద్ద ఎవరైనా కొడతారా? అని నిర్మాత నాగవంశీ అన్నారు. ఇప్పుడు మీకు తప్పును పట్టుకోలేకపోయిందుకు పార్టీ ఇవ్వాలని ఫన్నీగా కామెంట్స్ చేశారు. 

కాగా.. వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో తీసిన ఈ సినిమాని డబ్బు ప్రధాన ఇతివృత్తంగా తీశారు. 1992లో జరిగిన హర్షద్ మెహతా స్కామ్‌ని కాస్త టచ్ చేశారు. ఆద్యంతం ఎంటర్‌టైన్ చేస్తూ సాగిన ఈ మూవీకి తొలిరోజు రూ.12.7 కోట్లు గ్రాస్ కలెక్షన్ వచ్చాయి. ఈ మేరకు అధికారిక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement