శ్రీవారి సేవలో దిల్‌రాజు దంపతులు.. వీడియో వైరల్! | Tollywood Producer Dil Raju Visits Tirumala With His Wife, Video Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

Dil Raju In Tirumala Video: శ్రీవారి సేవలో దిల్‌రాజు దంపతులు.. వీడియో వైరల్!

Oct 24 2024 1:46 PM | Updated on Oct 24 2024 3:22 PM

Tollywood Producer Dil Raju Visits Tirumala With His Wife Video Goes Viral

టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత దిల్ రాజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయాన్నే శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. సతీసమేతంగా తిరుమల వెళ్లిన ఆయనకు ఆలయ పూజారులు తీర్థ, ప్రసాదాలు అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా.. దిల్‌ రాజు ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా వస్తోన్న గేమ్ ఛేంజర్‌ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శంకర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. డిసెంబర్‌లోనే రావాల్సిన గేమ్ ఛేంజర్‌.. చిరంజీవి విశ్వంభర పొంగల్‌ పోటీ నుంచి తప్పుకోవడంతో రామ్ చరణ్ వచ్చేస్తున్నాడు. కాగా.. ఈ మూవీలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ నటించింది.  ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్‌ సంగీతమందించారు. 

Advertisement
 
Advertisement
Advertisement