దిల్ రాజు బయోపిక్‌.. హీరోగా ఎవరు సెట్ ‍‍అవుతారంటే? | Tollywood Producer Dil Raju Biopic Hero name goes Viral | Sakshi
Sakshi News home page

Dil Raju: దిల్ రాజు బయోపిక్‌.. హీరోగా ఎవరు సెట్ ‍‍అవుతారంటే?

Jun 30 2025 4:38 PM | Updated on Jun 30 2025 5:00 PM

Tollywood Producer Dil Raju Biopic Hero name goes Viral

నితిన్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’. శ్రీరామ్‌ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలకపాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మించిన ఈ చిత్రం జూలై 4న రిలీజ్‌ కానుంది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీ అయిపోయారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే హీరో నితిన్‌- దిల్‌ రాజుతో ఇంటర్వ్యూ నిర్వహించారు.

ఈ ఇంటర్వ్యూలో నితిన్‌- దిల్ రాజు మధ్య సరదా సంభాషణ జరిగింది. భవిష్యత్తులో మీ బయోపిక్ తీసే అవకాశముందా? అని నితిన్ ప్రశ్నించారు. అందుకు తగిన కంటెంట్‌ ఉంటుందా? అని అడిగారు. దీనికి దిల్‌ రాజు సమాధానమిచ్చారు. కచ్చితంగా కావాల్సిన కంటెంట్ ఉంటుంది.. దాదాపు 30 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉన్నానని తెలిపారు. ఒకవేళ బయోపిక్ తీస్తే హీరోగా ఎవరైతే సెట్‌ అవుతుందని నితిన్ అడిగారు. చాలామంది నితిన్‌ నీ తమ్ముడిలా ఉంటారని చెబుతారు. అది నువ్వు ఒక్కడినే అని నాకు అనిపిస్తోందని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement