ఓటీటీలో దూసుకెళ్తోన్న టాలీవుడ్ చిత్రం.. పది రోజులుగా టాప్‌లోనే! | Tollywood Movie Simbaa Top Trending in Ott Streaming | Sakshi
Sakshi News home page

Simbaa Ott: సింబాకు సూపర్ రెస్పాన్స్.. ఓటీటీ టాప్‌లో ట్రెండింగ్‌!

Sep 16 2024 6:38 PM | Updated on Sep 16 2024 8:20 PM

Tollywood Movie Simbaa Top Trending in Ott Streaming

అనసూయ, జగపతి బాబు, వశిష్ట, శ్రీనాథ్  ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం సింబా. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్‌టాక్‌ను సొంతం చేసుకుంది. సందేశాత్మక చిత్రం కావడంతో  విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రకృతిని కాపాడుకోవాలన్న కథాంశంతో ఈ సినిమాను మురళీ మనోహర్ దర్శకత్వంలో తెరకెక్కించారు.  ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. సంపత్ నంది టీం వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మించారు.

ప్రస్తుతం సింబా మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక్కడ కూడా ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నప్పటికీ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో ఏకంగా టాప్‌-6 ప్లేస్‌లో ట్రెండ్‌ అవుతోంది. ఆహాలోనూ గత పది రోజులుగా టాప్‌లో ట్రెండింగ్‌ అవుతూనే ఉంది.  చెట్లను పెంచాల్సిన బాధ్యత మన మీద ఎంత ఉంది? ఎందుకు ఉంది? అనేది సింబాలో చక్కగా చూపించారు. మేసేజ్ ఓరియంటెడ్‌ మూవీ కావడంతో ఓటీటీ ప్రియుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement