Tollywood Hero Vishwak Sen's Post Goes Viral About Marriage - Sakshi
Sakshi News home page

Vishwak Sen: త్వరలోనే కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నా: విశ్వక్ సేన్

Aug 13 2023 7:53 PM | Updated on Aug 14 2023 9:35 AM

Tollywood Hero Vishwak Sen Post Goes Viral About Marriage - Sakshi

టాలీవుడ్ యంగ్, టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే తాను ఓ ఇంటివాడిని అవ్వబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ మేరకు తన అధికారిక ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఇటీవలే దాస్ కా ధమ్కీ సినిమాతో ప్రేక్షకులను ‍అలరించిన విశ్వక్ సేన్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఆగస్టు 15న వెల్లడిస్తానని తెలిపారు. 

(ఇది చదవండి: వెయిటర్‌గా మారిన విశ్వక్ సేన్‌.. అసలు కారణం ఇదే!)

అయితే దీనిపై నెటిజన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమో హ్యపీ మ్యారీడ్ లైఫ్ అంటూ పోస్టులు పెడుతున్నారు. మరికొందరేమో కొత్త సినిమా ప్రకటిస్తున్నారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇది కచ్చితంగా సినిమా గురించి అప్‌డేట్ అంటున్నారు. మరి దీనిపై ఇంకా క్లారిటీ రావాలంటే ఆగస్టు 15 వరకు ఆగాల్సిందే. కాగా.. విశ్వక్ సేన్ నటించిన ‘బూ’ సినిమా నేరుగా ఓటీటీలో  విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ అనే చిత్రంలో నటిస్తున్నారు. కృష్ణచైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో నేహాశెట్టి హీరోయిన్‌ నటిస్తుండగా.. అంజలి కీలక పాత్రలో కనిపించనుంది.

(ఇది చదవండి: నీకు ఇంకా 35 ఏళ్లే.. అమ్మను తలుచుకుంటూ జాన్వీ ఎమోషనల్!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement