టాలీవుడ్‌లో ఫస్ట్ ఏఐ మూవీ.. ఆసక్తిగా పోస్టర్ | Tollywood First Artificial Intelligence Based Ambas Revenge Movie Poster Out Now, Check More Details Inside | Sakshi
Sakshi News home page

Ambas Revenge Movie: టాలీవుడ్‌లో ఫస్ట్ ఏఐ మూవీ.. ఆసక్తిగా పోస్టర్

Jul 1 2026 10:10 PM | Updated on Jul 2 2026 4:13 PM

Tollywood First artificial Intelligence Based Movie poster out now

తెలుగు సినీ పరిశ్రమలో వస్తోన్న పూర్తిస్థాయి తొలి ఏఐ మూవీ 'అంబాస్ రివెంజ్'. ఈ సినిమాకు  జయవర్ధన్ మడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని నక్క తోక ఫిలిమ్స్ బ్యానర్‌పై యోగేంద్ర పొట్లూరి, రాణి మాడిసన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీని పూర్తిగా ఏఐ విజువల్ ఫీస్ట్‌గా తెరకెక్కిస్తున్నారు. ఏఐ డిజైన్ డెవలప్‌మెంట్‌ను 'కాలై విజువల్ స్టూడియోస్' అందిస్తోంది. తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. పూర్తి స్థాయి కృత్రిమ మేధ సహకారంతో రూపొందుతున్న తొలి తెలుగు ఫీచర్ ఫిల్మ్‌గా అంబాస్ రివెంజ్ నిలవనుంది.

భారత ఇతిహాసమైన మహాభారతంలోని శక్తివంతమైన పాత్ర అంబ స్ఫూర్తితో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పురాణ గాథను ఆధునిక దృక్పథంతో, అత్యాధునిక ఏఐ సాంకేతికతను మేళవించి వినూత్నంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది. తెలుగు సినిమాకు ఇది ఒక కొత్త ప్రయోగాత్మక అధ్యాయానికి నాంది అని దర్శకుడు జయవర్ధన్ తెలిపారు. 

ఈ చిత్ర నిర్మాణంలో పలు దశల్లో ఏఐ సాంకేతికతను వినియోగిస్తున్నామని.. ముఖ్యంగా విజువల్ డిజైన్, పాత్రల రూపకల్పన, కథా రూపాంతరం వంటి అంశాల్లో ఆధునిక ఏఐ సాధనాలను ఉపయోగించి వినూత్న కథనాన్ని ఆవిష్కరిస్తున్నామని చెప్పారు. ఈ టైటిల్ పోస్టర్ విడుదలతో చిత్రాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసే తొలి అడుగు పడిందని, సినిమా విడుదలకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో ప్రకటిస్తామని దర్శకుడు జయవర్ధన్ వెల్లడించారు. టాలీవుడ్‌లో ఫస్ట్ టైమ్ ఏఐ ఆధారిత మూవీ కావడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement