Tollywood Drugs Case: ఈడీ విచారణకు హాజరైన చార్మీ

Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నటి చార్మీ ఈడీ విచారణకు హాజరైంది. డ్రగ్స్ సరఫరా చేసే కెల్విన్‌తో చార్మీ వాట్సాప్ చాటింగ్ చేసినట్లు సమాచారం. కెల్విన్ ఇచ్చిన సమాచారంతో ఈడీ అధికారులు చార్మీని ప్రశ్నించనున్నారు. 2015-17వరకు జరిగిన బ్యాంక్ లావాదేవీల వివారాలను వెంట తేవాలని ఈడీ నోటీసులో పేర్కొంది. చార్మీ ప్రొడక్షన్ హౌస్ ఆర్థిక లావాదేవీలపై కూడా ఈడీ ఆరా తీయనుంది.
ఇది వరకే పూరి జగన్నాథ్ తన బ్యాంకు ఖాతాల వివరాలను ఈడీ అధికారులు సమర్పించారు. హీరోయిన్‌గా గుడ్‌బై చెప్పిన చార్మీ ప్రస్తుతం దర్శకుడు పూరి జగన్నాథ్‌తో కలిసి కో ప్రొడ్యూసర్ గా సినిమాలు తెరకెక్కిస్తుంది. 2017లో మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలపై చార్మీ ఎక్సైజ్ విచారణను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.
ఈ కేసులో నిందితుడుగా ఉన్న కెల్విన్ ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల ముందు లొంగిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఈడీ అధికారులకు అప్రూవర్‌గా మారిపోయాడు. కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈడీ అధికారులు నటి ఛార్మీ సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులకు నోటీసులు పంపినట్టుగా సమాచారం.
చదవండి : Tollywood Drugs Case: ఆమూడు ఖాతాలపై ఈడీ ఆరా
Tollywood Drugs Case: లొంగిపోయిన కెల్విన్.. కీలక సమాచారం సేకరించిన ఈడీ