'ఆ కారణం వల్లే సినిమాలకు బ్రేక్'.. మృణాల్ ఠాకూర్ | Tollywood actress Mrunal Thakur Comments about his New Project | Sakshi
Sakshi News home page

Mrunal Thakur: 'చాలా స్క్రిప్ట్‌లు విన్నా.. అలాంటి పాత్ర కోసమే వెయిటింగ్'

Oct 13 2026 12:13 PM | Updated on Oct 13 2026 12:30 PM

Tollywood actress Mrunal Thakur Comments about his New Project

సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. చివరిసారిగా డకాయిట్‌లో కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్ చేయడం లేదు. ఈ నేపథ్యంలోనే తన సినిమాలకు సంబంధించి మాట్లాడింది. గత తొమ్మిది నెలలుగా ఏ ప్రాజెక్ట్‌కు తాను సంతకం చేయలేదని తెలిపింది. మీనింగ్‌ఫుల్ పాత్ర కోసం తాను ఎదురు చూస్తున్నానని పేర్కొంది. అయితే తనకు ఆఫర్లకు కొదవలేదని కూడా స్పష్టం చేసింది.  

తాజా ఇంటర్వ్యూలో మృణాల్ మాట్లాడుతూ.. "నేను దాదాపు గత తొమ్మిది నెలలుగా ఏ సినిమాకు సంతకం చేయలేదు. నాకు ఒక అర్థవంతమైన పాత్ర వస్తుందని ఎదురుచూస్తున్నా. ఏ ప్రకటన జరగాల్సి ఉన్నా అది నా సోషల్ మీడియా ద్వారానే జరుగుతుంది. అప్పుడే దాని గురించి మాట్లాడటానికి నేను ఇష్టపడతా" అని అన్నారు.

తనకు చాలా స్క్రిప్ట్‌లు వస్తున్నాయని.. కానీ వాటిలో చాలా వరకు సృజనాత్మకంగా తనను ఆకట్టుకోలేకపోయాయని మృణాల్ తెలిపింది. నాకు ఆఫర్లు వస్తున్నాయి కానీ.. కథలు తనకు నచ్చడం లేదని వెల్లడించింది. అందుకే నేను కొంత విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్ననట్లు పేర్కొంది. ఎందుకంటే నేను ప్రతిరోజూ సెట్‌లో ఎందుకు ఉంటున్నానో అని ప్రశ్నించుకోవాలనుకోవడం లేదని కామెంట్స్ చేసింది. కాగా.. గతేడాది అత్యంత బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఈ ఏడాదిలో ఎలాంటి కొత్త ప్రాజెక్ట్ ‍అనౌన్స్ చేయకపోవడం టాలీవుడ్‌ చర్చనీయాంశంగా మారింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement