పర్యావరణం నేపథ్యంలో... | Today society is against Nature It needs a pan Indian movie like Myra: Sri Sri Sri Tridandi Devanatha Ramanuja Jeeyar Swamiji | Sakshi
Sakshi News home page

పర్యావరణం నేపథ్యంలో...

Feb 12 2024 12:55 AM | Updated on Feb 12 2024 12:55 AM

Today society is against Nature It needs a pan Indian movie like Myra: Sri Sri Sri Tridandi Devanatha Ramanuja Jeeyar Swamiji - Sakshi

దేవనాథ రామానుజ చిన్న జీయర్‌ స్వామి, స్మైల్‌ శ్రీను

ప్రకృతి, పర్యావరణం నేపథ్యంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా మూవీ ‘మైరా’. కన్నడంలో గుర్తింపు తెచ్చుకున్న స్మైల్‌ శ్రీను ఈ తెలుగు చిత్రానికి దర్శకుడు. త్రిదండి దేవనాథ రామానుజ చిన్న జీయర్‌ స్వామిని కలిసి ‘మైరా’ స్క్రిప్ట్‌కి పూజ చేయించి, ఆశీస్సులు తీసుకున్నారు శ్రీను. త్రిదండి చిన్న జీయర్‌ స్వామి మాట్లాడుతూ– ‘‘ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తూ, పర్యావరణాన్ని నాశనం చేస్తున్న ప్రస్తుత సమాజానికి ఉపయోగపడేలా ‘మైరా’ ఉంటుందని అనిపిస్తోంది’’ అన్నారు.

‘‘మైరా’కు తన ఆశీస్సులు, శిష్యుల సపోర్ట్‌ ఉంటుందని దేవనాథ రామానుజ జీయర్‌ స్వామివారు చెప్పడం ఆనందంగా ఉంది. ఈ సినిమాను తెలుగులో తీసి, కన్నడతో పాటు ఇతర భాషల్లో అనువాదం చేస్తాం. ఓ స్టార్‌ హీరోయిన్‌ మా సినిమాలో నటిస్తారు’’ అన్నారు స్మైల్‌ శ్రీను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement