తండ్రిని కోల్పోయిన బాధలోనూ సాయం చేసిన ప్రభాస్‌.. రచయిత ఎమోషనల్‌ | Thota Prasad About Prabhas Help in Difficult Time | Sakshi
Sakshi News home page

తండ్రి మరణించిన రోజే ఆస్పత్రిలో రచయిత.. సాయం చేసి ఆదుకున్న ప్రభాస్‌

Feb 24 2025 12:51 PM | Updated on Feb 24 2025 3:41 PM

Thota Prasad About Prabhas Help in Difficult Time

డార్లింగ్‌ ప్రభాస్‌ (Prabhas) మంచితనం గురించి అందరికీ తెలుసు. సెట్‌లోని వారికి ఇంటిభోజనం తెచ్చి కడుపు నిండే ఈయన ఆపదలో ఉన్న ఎంతోమందిని ఆదుకున్నాడు. ఆ జాబితాలో తానూ ఉన్నానంటున్నాడు రచయిత తోట ప్రసాద్‌. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 2010 ఫిబ్రవరిలో మహాశివరాత్రికి ముందు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాను. దురదృష్టవశాత్తూ అదేరోజు ప్రభాస్‌ తండ్రి సూర్యనారాయణరాజు (Uppalapati Surya Narayana Raju) కన్నుమూశారు. అది పన్నెండవ తారీఖు అనుకుంటాను!

తండ్రిని కోల్పోయిన బాధలోనూ..
తండ్రి మరణంతో శోకంలో మునిగిపోయిన ఆయన.. నేను ఆస్పత్రిలో ఉన్నానన్న విషయం తెలిసి నాకోసం ​కొంత డబ్బు పంపించారు. నాపై అంత శ్రద్ధ తీసుకున్నారు. ఎవరైనా తన ఇంట్లో కష్టం ఉన్నప్పుడు ఎదుటివారి గురించి ఆలోచించరు. అందులోనూ తండ్రిని కోల్పోవడం అంటే మామూలు బాధాకర విషయం కాదు. అటువంటి పరిస్థితిలోనూ ఆయన.. నా సినిమా రచయిత అని నన్ను సొంత మనిషిగా భావించి వెంటనే స్పందించారు. 

కన్నప్ప ద్వారా..
ప్రభాస్‌.. అంతటి మంచి వ్యక్తి. చాలాకాలం తర్వాత కన్నప్ప మూవీ ద్వారా ఆయనతో కలిసి పనిచేసే అవకాశం దక్కింది అని ఎమోషనలయ్యాడు. ప్రభాస్‌ బిల్లా సినిమాకు ప్రసాద్‌ సహరచయితగా పనిచేశాడు. ఇకపోతే ప్రభాస్‌ ప్రస్తుతం మారుతి 'రాజా సాబ్‌', హను రాఘవపూడి 'ఫౌజీ' సినిమాల్లో నటిస్తున్నాడు. అనంతరం స్పిరిట్‌, సలార్‌ 2, కల్కి 2 చిత్రాలు పట్టాలెక్కించనున్నాడు.

చదవండి: 'హిట్ 3' టీజర్ రిలీజ్.. అస్సలు ఊహించలే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement