తిరువీర్, ఐశ్వర్య రాజేశ్ జంటగా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ ఓ..! సుకుమారి. ఈ సినిమాకు భరత్‌దర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మహేశ్వరరెడ్డి మూలి నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది.
తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఒక్క నిజం దాచి పెట్టి పెళ్లి చేస్తే ఏం జరిగిందన్న పాయింట్‌తో ఈ మూవీని రూపొందించినట్లు అర్థమవుతోంది. "దేవుడు మన దగ్గర నుండి ఏదైనా తీసుకున్నాడంటే... ఇంకేదో గొప్పది ఇవ్వబోతున్నాడని దానర్ధం" అనే డైలాగ్ మరింత ఆసక్తి పెంచుతోంది. ఈ టీజర్ చూస్తుంటే ఫుల్ కామెడీగా ఉండనుందని తెలిసిపోతోంది. ఈ చిత్రంలో ఝాన్సీ, మురళీధర్‌గౌడ్, ఆనంద్, అంజిమామ, శివానంద్, కోట జయరామ్ కీలక పాత్రలు పోషించారు.


