Halamithi Habibo (Telugu) Lyric Video Song From Beast - Sakshi
Sakshi News home page

Arabic Kuthu Telugu Song: 'అరబిక్‌ కుతు' తెలుగు వెర్షన్‌ వచ్చేసింది.. విన్నారా..!

Apr 4 2022 6:05 PM | Updated on Apr 4 2022 9:50 PM

Telugu Version Of Arabic Kuthu Halamithi Habibo From Beast Released - Sakshi

ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదలైన 'అరబిక్ కుతు' (హలమితి హబీబో) సాంగ్‌ ఎంత క్రేజ్ సంపాందించుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యూట్యూబ్‌లో 260 మిలియన్లకుపైగా వ్యూస్‌ సొంతం చేసుకుని కొత్త రికార్డు సృష్టించింది.

Telugu Version Of Arabic Kuthu Halamithi Habibo From Beast Released: తమిళ స్టార్‌ హీరో విజయ్‌, టాలీవుడ్‌ బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం 'బీస్ట్‌'. నెల్సన్‌ దిలీప్ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు సూపర్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్‌కు మంచి స్పందన లభిస్తోంది.



ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదలైన 'అరబిక్ కుతు' (హలమితి హబీబో) సాంగ్‌ ఎంత క్రేజ్ సంపాందించుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యూట్యూబ్‌లో 260 మిలియన్లకుపైగా వ్యూస్‌ సొంతం చేసుకుని కొత్త రికార్డు సృష్టించింది.

ఇప్పుడు తాజాగా ఈ సాంగ్‌కు తెలుగు వెర్షన్‌ వచ్చింది. ఇప్పటివరకు తమిళ్‌లో అదరగొట్టిన ఈ పాట తెలుగులోనూ అలరించనుంది. కోలీవుడ్ సెన్సెషనల్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. అనిరుధ్‌, జోనితా గాంధీ ఆలపించారు. ఈ తెలుగు వెర్షన్‌కు శ్రీ సాయికిరణ్‌ సాహిత్యం అందించగా తమిళ వెర్షన్‌లో హీరో శివకార్తికేయన్‌ లిరిక్స్‌ అందించారు.



ఈ పాట సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అయింది. భాష, ఆ పదాలు అర్థం కాకపోయినా పదాల క్యాచీగా ఉండటం, విజయ్, పూజా హెగ్డె స్టెప్పులు, సంగీతానికి ఎంతోమంది ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీ అందించారు. 

Advertisement
 
Advertisement
Advertisement