లవ్‌ అండ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా నేనెవరు.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ | Sakshi
Sakshi News home page

లవ్‌ అండ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా నేనెవరు.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Published Thu, Nov 10 2022 3:55 PM

Telugu Movie Nenevaru Release In Theaters On November 25, 2022 - Sakshi

ప్రముఖ ఎడిటర్ స్వర్గీయ కోలా భాస్కర్ తనయుడు కోలా బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం నేనెవరు. సాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు నిర్ణయ్‌ పల్నాటి దర్శకత్వం వహిస్తున్నాడు. లవ్, సస్పెన్స్ థ్రిల్లర్ రూపొందిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని​ ఈ సినిమా నవంబర్‌ 25న విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల విడుదలైన టీజర్‌కు అనూహ్య స్పందన లభిస్తోందని. ఈ సందర్భంగా చిత్రం యూనిట్‌ ఆనందం వ్యక్తం చేస్తోంది.

ఈ మేరకు దర్శకుడు పల్నాటి మాట్లాడుతూ ఈ మూవీ ప్రతి ఒక్కరికి మంచి అనుభూతిని ఇస్తుందని తెలిపారు. కాగా కౌశల్‌ క్రియేషన్స్‌ పతాకంపై భీమినేని శివ ప్రసాద్‌-తన్నీరు రాంబాబులు సంయుక్తింగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇందులో బాహుబలి ప్రభాకర్‌ విలన్‌గా నటిస్తుండగా.. రాజా రవీంద్ర, దిల్‌ రమేశ్‌, డిఎస్‌ రావు, తాగుబోతు రమేశ్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement