
సినీ కార్మికుల వేతనాల పెంపుపై ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మండలి గడువు కోరింది. ఈ మేరకు కార్మిక శాఖ కమిషనర్ను కలిసిన ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మండలి ప్రతినిధులు రెండు రోజులు గడువు కోరారు. ఈ విషయాన్ని సినీ వర్కర్స్ ఫెడరేషన్ ప్రతినిధులకు కార్మిక శాఖ కమిషనర్ తెలిపారు.
ఛాంబర్ ప్రతినిధులు, ఫెడరేషన్ ప్రతినిధులతో రెండు రోజుల్లో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు కార్మిక శాఖ కమిషనర్ వెల్లడించారు. అంత వరకు షూటింగ్స్ ఆపవద్దని ఫెడరేషన్ ప్రతినిధులను కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఇరు వర్గాలతో చర్చల ద్వారా కార్మికుల వేతనాల సమస్య ఓ కొలొక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.