
‘‘చాలామంది వినోదాన్ని తేలిగ్గా తీసి పారేస్తారు. కానీ, ఆ కామెడీ సన్నివేశాల వెనక ఎంత కష్టం, నిజాయితీ దాగుందనేది చూసే వాళ్లకి అర్థం కాదు. ఆ సన్నివేశాలు రాసినవాళ్లకే తెలుస్తుంది. ‘పెళ్లిచూపులు’ చిత్రానికి కామెడీ సీన్స్ రాస్తున్నప్పుడు మా నాన్న ఆరోగ్యం చాలా సీరియస్‌గా ఉంది. టెన్షన్ పడుతూనే రాత్రి వేళల్లో ఆ సన్నివేశాలు రాశాను’’ అని నటుడు, డైరెక్టర్ తరుణ్ భాస్కర్(Tarun Bhaskar ) అన్నారు.
మహేశ్ చింతల, విద్యాసాగర్ కారంపురి, బలగం సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, కవితా శ్రీరంగం, దీక్షా కోటేశ్వర్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘బద్మాషులు’. శంకర్ చేగూరి దర్శకత్వంలో బి. బాలకృష్ణ, ఇ. రామ శంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదల కానుంది.
ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ–‘‘వినోద ప్రధానంగా రూపొందిన ‘బద్మాషులు’ చిత్రం మంచి విజయం సాధించాలి’’ అన్నారు. మరో ముఖ్య అతిథి డైరెక్టర్ మాలిక్ రామ్ మాట్లాడుతూ– ‘‘బద్మాషులు’ సినిమా భవిష్యత్తులో ఒక పెద్ద చిత్రానికి నాంది పలకబోతోందనిపిస్తోంది’’ అని చె΄్పారు. ‘‘రెండు గంటల ΄ాటు వినోదాన్ని పంచే చిత్రం ఇది’’ అన్నారు శంకర్ చేగూరి.