Tammareddy Bharadwaja : 'ఆర్‌ఆర్‌ఆర్‌' టీంపై తమ్మారెడ్డి భరద్వాజ కాంట్రవర్సీ కామెంట్స్‌

Tammareddy Bharadwaja Sensational Comments On RRR Team About Oscar Awards - Sakshi

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఎస్‌ ఎస్‌ రాజమౌళి. ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ఆస్కార్‌ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఈ చిత్రం నుంచి ‘నాటు నాటు’ పాట నామినేట్ అయ్యింది. ప్రస్తుతం ఆస్కార్‌ వేడుకలు ఉండటంతో ఆర్‌ఆర్‌ఆర్‌ టీం అమెరికాలో సందడి చేస్తుంది.

వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాను మరింత ప్రమోట్‌ చేస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌కు ఆస్కార్‌ రావాలని ప్రతి తెలుగువాళ్ళతో పాటు భారతీయులంతా కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సినీ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆర్‌ఆర్‌ఆర్‌ యూనిట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఆస్కార్‌ అవార్డు కోసం  ఆర్ఆర్ఆర్ టీం రూ. 80 కోట్లు ఖర్చు పెట్టింది.

అదే డబ్బుతో మేం  8-10 సినిమాలు తీసి ముఖాన కొడతాం.కేవలం వారు ఫ్లైట్ టికెట్స్ కోసమే కోట్లు ఖర్చుపెడుతున్నారు. ఇవన్నీ మాట్లాడుకోవడం కూడా టైమ్‌ వేస్ట్‌ అంటూ కాంట్రవర్సీ కామెంట్స్‌ చేశారు.  తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. తెలుగు సినిమా గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుతుంటే ఇలా మనవాళ్లే ఇలా మాట్లాడటం సిగ్గుచేటని దుయ్యబడుతున్నారు. 
 

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top