Tamil Producer SA Rajkannu Passed Away Due To Heart Attack - Sakshi
Sakshi News home page

SA Rajkannu Death: భారతీరాజాను దర్శకుడిగా పరిచయం చేసిన నిర్మాత కన్నుమూత

Jul 13 2023 9:57 AM | Updated on Jul 13 2023 10:27 AM

Tamil Producer SA Rajkannu Passed Away - Sakshi

కిళక్కు పోగుం రైయిల్‌ చిత్రం ద్వారా నటి రాధికను పరిచయం చేసిన ఘనత ఈయనదే. అదే విధంగా నటుడు కె.భాగ్యరాజ్‌ విలన్‌గా నటించిన 'కన్నె పరువత్తిలే',

సీనియర్‌ సినీ నిర్మాత ఎస్‌ఏ రాజ్‌కన్ను (77) మంగళవారం రాత్రి చైన్నెలో గుండెపోటుతో కన్నుమూశారు. రాజ్‌కన్ను అమ్మన్‌ క్రియేషన్స్‌ పతాకంపై కమల్‌ హాసన్‌, రజనీకాంత్‌, శ్రీదేవిలతో '16 వయదినిలే' వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాన్ని నిర్మించడంతో పాటు ఆ చిత్రం ద్వారా భారతీరాజాను దర్శకుడిగా పరిచయం చేశారు.

అదే విధంగా కిళక్కు పోగుం రైయిల్‌ చిత్రం ద్వారా నటి రాధికను పరిచయం చేసిన ఘనత ఈయనదే. నటుడు కె.భాగ్యరాజ్‌ విలన్‌గా నటించిన 'కన్నె పరువత్తిలే', కార్తీక్‌, రాధ జంటగా భారతీరాజా దర్శకత్వంలో 'వాలిభమే వావా', పటుడు పాండియన్‌, రేవతి జంటగా నటించిన 'పొన్ను పుడిచ్చిరిక్కు', కె.భాగ్యరాజ్‌ దర్శకత్వంలో 'ఎంగ చిన్న రాసా' వంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు.

ఈయన మృతిక నటుడు కమలహాసన్‌, నటి రాధిక, దర్శకుడు భారతీరాజా మొదలగు పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. కాగా రాజ్‌కన్ను భౌతిక కాయానికి బుధవారం మధ్యాహ్నం చైన్నె క్రోంపేటలో అంత్యక్రియలు నిర్వహించారు.

చదవండి: ఆయన వల్లే ఇదంతా.. ఏడ్చేసిన హీరోయిన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement