వీడియో లీక్‌.. వేరొకరైతే ఆత్మహత్య చేసుకునేవాళ్లు: నటి | Tamil Actress Reshma Pasupuleti Reaction To Leaked Video | Sakshi
Sakshi News home page

Reshma Pasupuleti: ఆ వీడియో లీక్‌.. వేరొకరైతే మెంటల్‌ టార్చర్‌తో సూసైడ్‌ చేసుకునేవాళ్లు

Jan 1 2023 6:59 PM | Updated on Jan 5 2023 5:35 PM

Tamil Actress Reshma Pasupuleti Reaction To Leaked Video - Sakshi

రేష్మ పసుపులేటి హాట్‌ వీడియో అని ఓ వీడియో వైరల్‌ అయింది. అది సుచీలీక్స్‌ పేరిట వచ్చిందని ఉంది. అప్పుడు నేను అమెరికాలో

సోషల్‌ మీడియా వల్ల ప్లస్‌లు, మైనస్‌లు రెండూ ఉంటాయి. ఏ సమాచారాన్నైనా, ఎక్కడి నుంచైనా క్షణాల్లో అందరికీ చేరవేస్తుంది సోషల్‌ మీడియా. అందులో పనికొచ్చేవాటితో పాటు ఫేక్‌ న్యూస్‌, ఫేక్‌ ఫోటో, ఫేక్‌ వీడియోలు కూడా ఉంటాయి. వీటిలో ఏది అసలో, ఏది అబద్ధమో తెలియక తికమకపడుతుంటారు జనాలు. కొందరైతే నటీమణులపై ఫేక్‌ వీడియోలు క్రియేట్‌ చేసి వారిని మానసికంగా ఇబ్బంది పెడుతుంటారు. అలా గతంలో తమిళ నటి రేష్మ పసుపులేటిపై కొందరు మార్ఫ్‌డ్‌ వీడియో చేసి నెట్‌లో వదిలారు.

తాజాగా దీనిపై రేష్మ స్పందిస్తూ.. 'రేష్మ పసుపులేటి హాట్‌ వీడియో అని ఓ వీడియో వైరల్‌ అయింది. అది సుచీలీక్స్‌ పేరిట వచ్చిందని ఉంది. అప్పుడు నేను అమెరికాలో ఉన్నాను. నా చెల్లి ఫోన్‌ చేసి నీ వీడియో లీక్‌ అయింది అని చెప్పింది. నేను షాకయ్యాను. అసలు నేను ఊర్లోనే కాదు కదా ఇండియాలోనే లేను. కనీసం నాకు బాయ్‌ఫ్రెండ్‌ కూడా లేడు, అలాంటప్పుడు నా వీడియో ఎలా లీకవుతుంది? అమ్మే.. చెల్లితో ఫోన్‌ చేయించిందని అర్థమైంది. నాన్న సినీ నిర్మాత, తాతయ్య కూడా నిర్మాతే, అన్నయ్య ఒక నటుడు.. ఇలా అందరూ ఇండస్ట్రీలోనే ఉన్నారు కాబట్టి నన్ను అర్థం చేసుకున్నారు. అదంతా ఫేక్‌ అండ్‌ మార్ఫ్‌డ్‌ వీడియో అని పసిగట్టారు.

నా స్థానంలో వేరొకరు ఉంటే మెంటల్‌ టార్చర్‌తో కుమిలిపోయేవాళ్లు. ఆ వీడియోను నాకు పంపించమని చెల్లికి చెప్పాను. నా శరీరం గురించి నాకు తెలుసు కదా! అందులో ఉన్న అమ్మాయి నాకంటే అందంగా ఉంది. అందరం నవ్వుకున్నాం. కానీ నా స్థానంలో ఇంకో అమ్మాయి ఉండుంటే ఆత్మహత్య చేసుకునేది!' అని చెప్పుకొచ్చింది రేష్మ. కాగా జిగర్తాండ హీరో బాబీ సింహా చెల్లెలే రేష్మ. మసాలా పాదం సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. పలు సినిమాలు చేసిన ఆమె ప్రస్తుతం భాగ్యలక్ష్మి అనే సీరియల్‌లో నటిస్తోంది. గతంలో తమిళ బిగ్‌బాస్‌ షోలోనూ పాల్గొంది.

చదవండి: రష్మికతో విజయ్‌ న్యూఇయర్‌ ట్రిప్‌, ఫోటో వైరల్‌
ఆ ఇద్దరినీ షాపింగ్‌కు తీసుకెళ్తా: ప్రభాస్‌

Advertisement
 
Advertisement
Advertisement