గెలుపోటములు, నిశ్శబ్ధంగా ఏడ్చిన రోజులు..: విజయ్‌ దేవరకొండ | Vijay Devarakonda Emotional Post to Welcome New Year 2023 | Sakshi
Sakshi News home page

Vijay Devarakonda: రష్మికతో విజయ్‌ న్యూ ఇయర్‌ ట్రిప్‌! ఫోటోలు వైరల్‌

Jan 1 2023 5:34 PM | Updated on Jan 1 2023 6:12 PM

Vijay Devarakonda Emotional Post to Welcome New Year 2023 - Sakshi

నిశ్శబ్ధంగా ఏడ్చిన రోజులు, లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నాలు, గెలుపోటములు.. ఇలా అన్ని రకాల

ప్రేమలో పడ్డాను అని విజయ్‌ దేవరకొండ ఏనాడూ చెప్పలేదు. కానీ అభిమానులు మాత్రం నీ మనసు నాకు తెలుసు అంటూ రౌడీ హీరో.. నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా ప్రేమలో మునిగి తేలుతున్నాడని కథలు అల్లేశారు. తరచూ వీరిద్దరూ కలిసి కనిపించడంతో ఇదే నిజమనుకున్నారంతా! అయితే మేమిద్దరం మంచి స్నేహితులమేనని అటు విజయ్‌, ఇటు రష్మిక కుండ బద్ధలు కొట్టి మాట్లాడారు. దీంతో లవ్‌ రూమర్స్‌కు కొంతకాలం పాటు బ్రేక్‌ పడింది. కానీ ఆ తర్వాత ఇద్దరూ సీక్రెట్‌గా కలుసుకోవడం మొదలుపెట్టారు. కలిసి వెకేషన్‌కు కూడా వెళ్లారు. ఫ్రెండ్స్‌ అయితే సీక్రెట్‌గా కలవడమెందుకో? ఇది కచ్చితంగా లవ్వేనని ఫిక్సయ్యారు ఫ్యాన్స్‌.

ఇదిలా ఉంటే తాజాగా రౌడీ హీరో 2022కి గుడ్‌బాయ్‌ చెప్తూ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టాడు. 'ఆనందకర క్షణాలు, నిశ్శబ్ధంగా ఏడ్చిన రోజులు, లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నాలు, గెలుపోటములు.. ఇలా అన్ని రకాల అనుభవాలతో గత ఏడాది గడిచిపోయింది. అన్నింటి సమ్మేళనమే జీవితం.. ప్రతిదాన్ని సెలబ్రేట్‌ చేసుకోవాల్సిందే! హ్యాపీ న్యూ ఇయర్‌ మై లవ్స్‌, హావ్‌ ఎ గ్రేట్‌ న్యూ ఇయర్‌' అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టాడు.

దీనికి ఓ రిసార్ట్‌లో నీళ్లలో దిగి ఎంజాయ్‌ చేస్తున్న ఫోటోను జత చేశాడు. ఈ ఫోటోతో విజయ్‌- రష్మికల మధ్య ఉన్న ప్రేమ మరోసారి బయటపడింది. సరిగ్గా అదే రిసార్ట్‌లో ఒకే బ్యాక్‌గ్రౌండ్‌లో రష్మిక ఓ ఫోటో దిగగా దాన్ని అక్టోబర్‌ 9న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ఇప్పుడీ రెండు ఫోటోలను పక్కన పెట్టి చూస్తుంటే ఇద్దరూ కలిసే అక్కడ విడిది చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్‌ ఊరుకుంటారా? ఇద్దరూ రహస్యంగా కలుసుకుంటున్నారు, మళ్లీ ప్రేమాగీమా లేదని అబద్ధం చెప్తున్నారు. మీరేం చెప్పినా మీ మనసులో ఏముందో మాకు తెలుసులే అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే రష్మిక బీచ్‌లో సేద తీరుతున్నట్లుగా తాజాగా ఓ ఫోటో షేర్‌ చేసింది. దీంతో ప్రేమపక్షులు 2023కి కలిసి వెల్‌కమ్‌ చెప్పేందుకు మరోసారి వెకేషన్‌కు చెక్కేశారంటున్నారు నెటిజన్లు.

చదవండి: ఎలాంటి సిగ్గు లేకుండా ఆ విషయం అడిగేశా: విద్యాబాలన్‌
ఆ ఇద్దరు హీరోయిన్లను షాపింగ్‌కు తీసుకెళ్తా: ప్రభాస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement