యువ నటిని పెళ్లాడిన నటుడు | Tamil Actor Arav Got Married | Sakshi
Sakshi News home page

యువ నటిని పెళ్లాడిన నటుడు

Sep 7 2020 7:15 AM | Updated on Sep 7 2020 7:16 AM

Tamil Actor Arav Got Married - Sakshi

చెన్నై : నటుడు అరవ్‌ పెళ్లి ఆదివారం చెన్నైలో జరిగింది. ఈయన మరో యువ నటిని పెళ్లి చేసుకున్నాడు. బిగ్‌బాస్‌ రియాల్టీ గేమ్‌ షో మొదటి సీజన్‌లో పాల్గొని విన్నర్‌గా నిలవడంతోపాటు, హౌస్‌లో చర్చనీయాంశ సభ్యుడిగా వార్తల్లోకి ఎక్కిన వ్యక్తి అరవ్‌. ఇతనికి ఆ హౌస్‌లో పాల్గొన్న నటి ఓవియ మధ్య ప్రేమాయణం పెద్ద వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. కాగా ఆ తర్వాత కూడా వీరిద్దరి గురించి ప్రేమ వదంతులు దొర్లాయి. అయితే వాటిని అరవ్, నటి జూలియా ఖండించారు. అరవ్‌కు నటి రాహీకు మధ్య చాలా కాలంగా ప్రేమాయణం నడుస్తోందని ప్రచా రం జరుగుతోంది. ( సినిమాను ఏలింది చాలు.. రాజకీయాల్లోకి రండి! )

కాగా అరవ్‌ నటి రాహీ అనూహ్యంగా ఆదివారం ఉదయం పెళ్లి పీటలు ఎక్కారు. చెన్నైలో జరిగిన  వీరి పెళ్లి వేడుకకు దర్శకుడు కేఎస్‌ రవికుమార్, గాయత్రి రఘురాం, గణేష్‌ ఆర్తి దంపతులు, నిర్మాత సురభి మోహన్, దర్శకుడు సతీష్, నటి సుజా వరూణీ, నటుడు శివ, గీత రచయిత స్నేహన్, నటుడు గణేష్‌ వెంకట్రామన్, దర్శకుడు విజయ్, నటి బిందుమాధవి, నటుడు హరీష్‌ కల్యాణ్‌ విచ్చేసి నవ దంపతులకు ఆశీస్సులు అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement