సినిమాను ఏలింది చాలు.. రాజకీయాల్లోకి రండి!

Fans Requests Surya To Come Into Tamil Politics - Sakshi

చెన్నై : ‘మీరు సినిమాను ఏలింది చాలు– ఇక తమిళనాడును పాలించేందుకు రండి’. నటుడిగా పాతికేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా హీరో సూర్య తన అభిమానుల నుంచి ఈరకమైన రాజకీయ ఆహ్వానాన్ని అందుకున్నారు. తమిళనాడులో సినీ, రాజకీయరంగాలకు మధ్య ఉన్న అనుబంధం జగమెరిగిన సత్యమే. తాజాగా నటుడు సూర్య పైనా రాజకీయ ఒత్తిడి పెరుగుతోంది. సూర్య రాష్ట్ర వ్యాప్తంగా తమ అగరం ఫౌండేషన్‌ ద్వారా అనేక సహాయ కార్యక్రమాలను చేస్తున్నారు. దీంతో సూర్య రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్ష ఆయన అభిమానుల్లో పెరుగుతోంది. సూర్య నటుడిగా పరిచయమై శనివారానికి 23 ఏళ్లు అవుతుంది. ( మరోసారి మంచి మనసు చాటుకున్న సూర్య )

ఈ సందర్భంగా ‘మీరు సినిమాను ఏలింది చాలు ఇక తమిళనాడును పాలించడానికి రండి’ అనే నినాదంతో సూర్య అభిమానుల పోస్టర్లు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో వెలిశాయి. అందులో విప్లవ నాయకుడు చేగువేరా రూపంలో సూర్య ఫొటోలు పొందుపరిచి పక్కన తమిళనాడు సచివాలయం ఫొటోను ముద్రించారు. ఈ పోస్టర్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top