అదరగొడుతున్న హారర్‌ మూవీ.. ఏకంగా వంద కోట్లు.. | Tamannaah, Raashi Khanna Starrer Aranmanai 4 Movie Crosses Rs 100 Cr At Box Office | Sakshi
Sakshi News home page

సెంచరీ కొట్టిన హారర్‌ మూవీ.. భయపెడుతూనే ఆకట్టుకుంటోందిగా!

Published Thu, May 23 2024 4:56 PM | Last Updated on Thu, May 23 2024 5:21 PM

Tamannaah, Raashi Khanna Starrer Aranmanai 4 Movie Crosses Rs 100 Cr At Box Office

హారర్‌ థ్రిల్లర్‌ మూవీ బాక్సాఫీస్‌ దగ్గర అదరగొడుతోంది. ఏకంగా వంద కోట్లు రాబట్టింది. ఆ సినిమా మరేదో కాదు అరణ్మనై 4. సుందర్‌, తమన్నా, రాశీ ఖన్నా ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ మే 3న తమిళనాట ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో బాక్‌ పేరిట విడుదలైంది. 20 రోజుల్లో ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సెంచరీ కొట్టింది. ఈ ఏడాది సెంచరీ కొట్టిన తొలి తమిళ చిత్రంగా రికార్డు సృష్టించింది.

సెంచరీ..
ఈ విషయాన్ని చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. అరణ్మనై వంద కోట్లు వసూలు చేసిందంటూ ప్రత్యేక పోస్టర్‌ విడుదల చేసింది. అరణ్మనై ఫ్రాంచైజీలో ఇప్పటివరకు మూడు సినిమాలు వచ్చాయి. అవన్నీ విజయం సాధించగా ఈసారి నాలుగో పార్ట్‌ తీశారు. గత చిత్రాలన్నింటికంటే అరణ్మనై 4 అద్భుత విజయం సాధించింది. 

నాలుగో పార్ట్‌లో మెయిన్‌ లీడ్‌..
ఇక గత మూడు చిత్రాల్లో సహాయక పాత్రల్లో కనిపించిన ఈ సినిమా డైరెక్టర్‌ సుందర్‌ నాలుగో పార్ట్‌లో మాత్రం ప్రధాన పాత్రలో నటించడం విశేషం. కుష్బూకు చెందిన అవ్నీ సినీ మ్యాక్‌, ఏసీఎస్‌ అరుణ్‌కుమార్‌కు చెందిన బెంజ్‌ మీడియా సంస్థ కలిసి నిర్మించిన ఈ మూవీలో యోగిబాబు, కోవై సరళ, రామచంద్ర రాజు, సంతోష్‌ ప్రతాప్‌ సహాయక పాత్రల్లో నటించారు. హిప్‌హాప్‌ ఆది సంగీతం అందించాడు.

 

 

చదవండి: పవిత్ర-చందు మరణం.. నటుడు నరేశ్‌ కీలక వ్యాఖ్యలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement