చూపు తిప్పుకోనివ్వని తమన్నా డ్యాన్స్‌.. వీడియో వైరల్‌ | Tamannaah Bhatia Dance Video Viral | Sakshi
Sakshi News home page

చూపు తిప్పుకోనివ్వని తమన్నా డ్యాన్స్‌.. వీడియో వైరల్‌

Jul 9 2021 2:29 PM | Updated on Jul 9 2021 7:08 PM

Tamannaah Bhatia Dance Video Viral - Sakshi

త‌మ‌న్నా.. ఈ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది మిల్కీ అందాలే.  ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 15 ఏళ్లైపోతున్న ఇప్పటికి తమన్నాలో అందం ఏమాత్రం తగ్గలేదు. దాదాపు స్టార్‌ హీరోలందరితోనూ నటించిన ఈ భామ ప్రస్తుతం తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టిస్తూ తన సత్తాను చాటుతోంది. యాక్టింగ్‌తోపాటు తమన్నాకు డ్యాన్స్‌లోనూ మంచి పట్టు ఉన్న సంగతి తెలిసిందే. అందుకే సినిమాలో స్పెషల్‌ సాంగ్స్‌లోనూ దుమ్మురేపుతోంది. కేవలం ఒక్క పాట కోసం కూడా భారీగానే పారితోషికం తీసుకుంటుంది తమన్నా.

తమన్నాకు సోషల్‌ మీడియాలోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువే. తన మూవీస్‌, వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకునే మన అవంతిక(బాహుబలిలో తమన్నా పాత్ర పేరు) తాజాగా ఓ ఫుల్‌ బీట్‌తో కూడిన డ్యాన్స్‌ను షేర్‌ చేసింది. చురకైన డ్యాన్స్ స్టెప్పులతో వావ్‌ అనేలా చేసింది. డోజా కాట్, ఓ బాయ్ కలసి పాడిన ‘కిస్ మీ మోర్’ అనే పాటకు కొరియోగ్రాఫర్ షజియా సమ్జీతో కలసి హుషారైన స్టెప్పులు వేసింది. తమన్నా చేసిన ఈ డ్యాన్స్‌ వీడియో నెట్టింటా వైరల్‌గా మారింది. మరోవైపు. ‘సీటీమార్‌’ సినిమా ను పూర్తి చేసిన తమన్నా ప్రస్తుతం ‘గుర్తుందా.. శీతాకాలం’, ‘మ్యాస్ట్రో’, ‘ఎఫ్‌ 3’ సినిమాల్లో నటిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement