Tamanna Opens Up On Her Recent Devotional And Temple Visits, Deets Inside - Sakshi
Sakshi News home page

Thamannah: నయన్‌ బాటలో తమన్నా.. ఆ అనుభూతి ఉత్సాహాన్నిచ్చిందంటున్న మిల్కీ బ్యూటీ

Jul 11 2022 9:54 AM | Updated on Jul 11 2022 10:52 AM

Tamanna Opens Up On Her Recent Devotional And Temple Visit - Sakshi

హీరోయిన్లు ఒక స్థాయికి చేరుకున్న తరువాత పెళ్లి, ఇతర విషయాలపై దృష్టి పెడుతారు. దానికోసం వారు దేవాలయాలు సందర్శిస్తూ ఆధ్యాత్మిక బాట పడుతుంటారు. దీనికి సౌత్‌ లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార ఉదాహరణ. పెళ్లికి ముందు నయన్‌ గుళ్లు గోపురాలు తిరిగి పూజలు నిర్వహించారు. తాజాగా నయన్‌ బాటలోనే మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఆధ్యాత్మిక చింతన బాట పట్టారని తెలుస్తోంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించిన ఈ అమ్మడు టాప్‌ హీరోయిన్‌గా ఎదిగారు. ఇంతవరకు పెళ్లి ఊసెత్తని ఈ గుజరాతి భామ షూటింగ్‌ విరామ సమయంలో ఆలయాలకు వెళ్లి దైవదర్శనం చేసుకున్నారు. అంతేకాదు ఇటీవల హిమాలయ ప్రాంతాలను కూడా చుట్టివచ్చారు.

చదవండి: జూ.ఎన్టీఆర్‌-కొరటాల మూవీ షూటింగ్‌ మొదలయ్యేది అప్పుడే!

ప్రసిద్ధి చెందిన వైష్ణవీ దేవి ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక పయనం తనకు మంచి అనుభూతి, ఉత్సాహాన్ని కలిగించిందని చెప్పారు. దీనితో పాటు ఆమె ఈశా యోగా మైదానానికి వెళ్లి ధ్యానం చేసిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. అందులో ఈశ యోగి మైదానంలో తాను గడిపిన మూడు రోజులు జీవితంలో మధురమైనవని పేర్కొన్నారు. ఆరోగ్య పరంగానూ పలు మంచి విష యాలు జరిగాయని, ప్రపంచం ఎంతో ఆశీర్వకరమైన దంటూ అనుభవపూర్వకంగా తెలిసిందన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement