NTR30 Shooting Update: జూ.ఎన్టీఆర్‌-కొరటాల మూవీ షూటింగ్‌ మొదలయ్యేది అప్పుడే!

Is Jr NTR, Koratala Siva Movie NTR30 Shooting Starts In September - Sakshi

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ తర్వాత ప్రస్తుతం జూనియర్‌ ఎన్టీఆర్‌ కోరటాల శివతో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. జనతా గ్యారేజ్‌ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందతున్న చిత్రమిది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్‌ 30 రూపొందే ఈ చిత్రం ఇప్పటికే సెట్స్‌పైకి రావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఇది వాయిదా పడింది. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ను కూడా కొరటాల టీం ఇవ్వడం లేదు. దీంతో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఆయనపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ మూవీ షూటింగ్‌ ఎప్పుడెప్పుడు స్టార్ట్‌ అవుతుందా అని ఫ్యాన్స్‌ అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

చదవండి: ఆ ఒక్క మాటతో ఫిదా చేసిన ప్రభుదేవా..

ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌ 30కి సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇటీవల స్క్రీప్ట్‌లో కొన్ని మార్పులు, చెర్పులు చేసే పనిలో ఉన్న కొరటాల దాన్ని పూర్తి చేశారట. అంతేకాదు త్వరలోనే ప్రీ ప్రోడక్ష్‌న్‌ పనులను కూడా మొదలు పెట్టి మూవీని సెప్టెంబర్‌లో సెట్స్‌పైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సినీవర్గాల నుంచి సమాచారం. అంతేకాదు త్వరలోనే ఈ చిత్రంలోని హీరోయన్‌ ఇతర తారగణంకు సంబంధించిన వివరాలను కూడా ప్రకటించేందుకు చిత్ర బృందం ప్లాన్‌ చేస్తోందట. కాగా ఎన్టీఆర్‌30(NTR30)గా రూపొందే ఈ ఈ చిత్రాన్ని కల్యాణ్‌ రామ్‌ సమర్పణలో యువసుధ ఆర్ట్స్‌, ఎన్టీఆర్‌ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్‌, హరికృష్ణలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మించనున్నారు. ఈ సినిమాకు అనిరుద్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తున్నాడు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top