ఓ తల్లి ప్రతీకారం | Taapsee Pannu Gandhari Movie Update | Sakshi
Sakshi News home page

ఓ తల్లి ప్రతీకారం

Nov 20 2024 12:35 AM | Updated on Nov 20 2024 12:38 AM

Taapsee Pannu Gandhari Movie Update

తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో అటు హీరోయిన్‌గా ఇటు లేడీ ఓరియంటెడ్‌ సినిమాల్లో నటించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు తాప్సీ. తాజాగా ఆమె ప్రధానపాత్రలో నటిస్తున్న హిందీ చిత్రం ‘గాంధారి’. దేవాశిష్‌ మఖీజా దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కనికా థిల్లాన్‌ కథ అందించడంతోపాటు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఎలాంటి డూప్‌ లేకుండా యాక్షన్‌ సన్నివేశాల్లోపాల్గొన్నారట తాప్సీ. తల్లీకూతుళ్ల అనుబంధం, ఓ తల్లి ప్రతీకారం అంశాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని సమాచారం.

కిడ్నాప్‌ అయిన తన కుమార్తెను కాపాడుకునేందుకు ఓ తల్లి చేసేపోరాటం నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. వెండితెరపై తాప్సీ తల్లిపాత్రలో కనిపించనున్న తొలి చిత్రం ఇదే. త్వరలో ‘గాంధారి’ సినిమా విడుదల తేదీని ప్రకటించనుంది యూనిట్‌. ఇదిలా ఉంటే... తాప్సీ ఓ ప్రధానపాత్రలో నటించి, కనికా థిల్లాన్‌ కథ అందించిన ‘హసీన దిల్‌రుబా’, ఫిర్‌ ఆయీ హసీన దిల్‌ రుబా’లకు మంచి స్పందన లభించింది. దీంతో వీరి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘గాంధారి’పై బాలీవుడ్‌లో మంచి అంచనాలున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement