నేను సెలబ్రిటీ మాత్రమే.. పబ్లిక్‌ ప్రాపర్టీని కాదు: తాప్పీ | Taapsee Pannu Comments On Photographer And Fans | Sakshi
Sakshi News home page

నేను సెలబ్రిటీ మాత్రమే.. పబ్లిక్‌ ప్రాపర్టీని కాదు: తాప్పీ

Aug 25 2024 9:30 AM | Updated on Aug 25 2024 11:28 AM

Taapsee Pannu Comments On Photographer And Fans

సెలబ్రిటీలను చూడగానే ముఖ్యంగా సినీ నటీనటులు కనిపిస్తే వారితో సెల్ఫీలు తీసుకోవడానికి అభిమానులు ఆసక్తి చూపుతుంటారు. కెమెరామెన్‌లు అయితే వారిపైపు దూసుకుపోతారు. అయితే, కొందరు సెలబ్రిటీలు అభిమానులతో సెల్ఫీలు దిగుతుంటారు. మరి కొందరు వారి నుంచి తప్పించుకుని వేగంగా వెళ్లిపోతారు. మరి కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. ఇక ఫొటోగ్రాఫర్స్‌ అయితే వెంటపడి మరీ సెలబ్రిటీలను ఫొటోలు తీస్తుంటారు. వీటిలో నటి తాప్సీ ఏ కోవకు చెందిన నటినో తెలుసా? 

మొదట్లో దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు, తమిళం భాషల్లో కథానాయకిగా నటించి పేరు, డబ్బు గడించిన నటి తాప్సీ. ఆ తరువాత బాలీవుడ్‌లో అవకాశాలు రావడంతో దక్షిణాది చిత్రాలపై చిన్నచూపు చూపడం మొదలెట్టారు. ముఖ్యంగా తెలుగు దర్శకులు హీరోయిన్ల బొడ్డు, నడుము ఎక్కువగా చూపిస్తుంటారని ఆరోపణలు చేసి వివాదాస్పద నటిగా ముద్ర వేసుకున్నారు. ఆ తరువాత మాట మార్చి తానలా అనలేదు అంటూ రాగాలు తీశారనుకోండి. కాగా ఇటీవల ఒక భేటీలో ఫోటోగ్రాఫర్లతో గొడవ గురించి స్పందిస్తూ  ‘నేను సెలబ్రిటీనే అయితే పబ్లిక్‌ ప్రాపర్టీని కాదు. ఈ రెండింటికీ చాలా వ్యత్యాసం ఉంది. దీనిపై నాకు పూర్తి క్లారిటీ ఉంది. 

నాపై ఎవరైనా అరిస్తే ఊరుకోను. వెంటనే తిరిగి సమాధానం ఇచ్చేస్తాను.  కెమెరాలతో నాపైకి దూసుకురావడం, ఫిజికల్‌గా హ్యాండిల్ చేయడం ఏంటి..? ఇది కరెక్ట్ కాదు. ఇబ్బంది ఎదురైనప్పుడు  తెర వెనుక లేదా ముందు స్త్రీలు  లేదంటే లేదు అంతే.. నేను మొదట అమ్మాయిని.. ఆ తరువాతనే నటిని. నేనిలా చెప్పడం వల్ల ఈ వృత్తికి తగిన వ్యక్తిని కాదు అని భావించవచ్చు. అయితే నటన నాకు నచ్చిన వృత్తి’ అని నటి తాప్సీ పేర్కొన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement