అమెజాన్‌ ప్రైమ్‌లో సూర్య కొత్త సినిమా, స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే? | Suriya Movie Jai Bhim To Premiere on November 2 on Amazon Prime Video | Sakshi
Sakshi News home page

అమెజాన్‌ ప్రైమ్‌లో సూర్య జై భీమ్‌, స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?

Oct 1 2021 9:44 PM | Updated on Oct 1 2021 9:44 PM

Suriya Movie Jai Bhim To Premiere on November 2 on Amazon Prime Video - Sakshi

తమిళ హీరో సూర్యకు తెలుగులోనూ విపరీతమైన క్రేజ్‌ ఉంది. అందుకే ఆయన సినిమాలన్నీ తెలుగులోనూ డబ్‌ అవుతూ వస్తున్నాయి. ఇటీవల ఆయన నటించిన 'సూరరై పోట్రు' తెలుగులో 'ఆకాశం నీ హద్దురా' పేరుతో రిలీజై ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమా కరోనా కారణంగా థియేటర్‌లో కాకుండా నేరుగా ఓటీటీలోనే విడుదలైన విషయం తెలిసిందే! 

తాజాగా సూర్య నటించిన మరో చిత్రం 'జై భీమ్‌' కూడా ఓటీటీలోనే రిలీజ్‌ అవుతోంది. ఇందులో సూర్య లాయర్‌ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రం నవంబర్‌ 2 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులోకి రానుంది. ఈమేరకు ప్రైమ్‌ వీడియో అధికారికంగా ప్రకటన వెలువడించింది. కాగా జై భీమ్‌ చిత్రానికి టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వం వహించాడు. ప్రకాశ్‌రాజ్‌, రావు రమేశ్‌, లిజొమోల్‌ జోస్‌, రాజీశ విజయన్‌, మణికందన్‌ ముఖ్యపాత్రలు పోషించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement