అభిమానితో దురుసు ప్రవర్తన? హీరో సూర్య తండ్రిపై విమర్శలు | Sakshi
Sakshi News home page

శాలువా ఎందుకు విసిరేశారు? వివాదంపై క్లారిటీ ఇచ్చిన హీరో తండ్రి

Published Wed, Feb 28 2024 10:53 AM

Suriya Father Siva Kumar Throw Fan Shawl Video  - Sakshi

తమిళ స్టార్ హీరో సూర్యకి తెలుగులోనూ కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. అమ్మాయిల్లో క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సూర్య పెద్దగా వివాదాల జోలికి పోడు. తాజాగా ఈ హీరో తండ్రి మాత్రం ఓ అభిమానితో దురుసుగా ప్రవర్తించారని, తెచ్చిన శాలువా విసిరేశారని అంటూ ఓ వీడియో వైరల్ అయింది. దీంతో సూర్య తండ్రిపై విమర్శలు వచ్చాయి. దీంతో అసలేం జరిగింది? ఎందుకు అలా ప్రవర్తించాల్సి వచ్చిందని స్వయనా సూర్య తండ్రి క్లారిటీ ఇచ్చేశారు.

ఏం జరిగింది?
నటుడు, డబ్బింగ్ ఆర్టిస్టుగా గుర్తింపు శివకుమార్ తాజాగా చెన్నైలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈవెంట్ పూర్తయిన తర్వాత బయటకు వెళ్తున్న క్రమంలోనే ఓ వ్యక్తి, ఈయన కోసం శాలువా తీసుకొచ్చాడు. దాని ఒంటిపై కప్పబోతుంటే.. శివకుమార్ దాన్ని చేతిలోకి తీసుకుని కింద పడేశారు. అయితే శాలువా పట్టుకొచ్చిన వ్యక్తి శివకుమార్‌కి ఫ్రెండ్ మనవడే. దీంతో చనువు కొద్ది నాకెందుకురా అనే ఉద్దేశంతోనే విసిరేశారట.

(ఇదీ చదవండి: నేను బతికే ఉన్నాను.. రూమర్స్‌పై యువనటి క్లారిటీ)

50 ఏళ్ల నుంచి బెస్ట్ ఫ్రెండ్స్
'వీడియోలో ఉన్నది మా తాత కరీమ్. శివకుమార్, ఆయన గత 50 ఏళ్ల నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. శాలువా ఇస్తున్నప్పుడు.. ఎందుకురా ఇవన్నీ అని జోక్ చేస్తూ దాన్ని విసిరేశారు. వెళ్దాం పద అని తాతతో పాటు కిందకు వెళ్లిపోయారు. శాలువా నీ దగ్గరే ఉండనివ్వు అని మా తాతతో అన్నారు. మా తాత కారైకుడీలో ఉంటారు. అక్కడ జరిగిన ఈవెంట్‌కే శివకుమార్ అతిథిగా వెళ్లారు. నిజమేంటో తెలియకుండా తప్పుడు ప్రచారం చేయొద్దు' అని కరీమ్ మనవడు రిఫాయ్ చెప్పుకొచ్చాడు.

శివకుమార్ ఏం చెప్పారు?
'నేను, కరీమ్ చాలా క్లోజ్. కానీ కొత్తగా నా కోసం శాలువా తీసుకొచ్చాడు. కానీ ఇదంతా నచ్చక తిరిగిచ్చేశాను. అయితే ఆ రోజు సరిగా విశ్రాంతి లేకపోవడం వల్ల స్పీచే కష్టంగా ఇచ్చాను. అన్ని పూర్తి చేసుకుని బయటకొస్తుంటే శాలువా తీసుకొచ్చాడు. కానీ అది కిందపడేయడం నా తప్పే. దానికి నేను సారీ చెబుతున్నా' అని శివకుమార్ ఓ వీడియోలో చెప్పుకొచ్చారు. 

(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా)

Advertisement
 
Advertisement