
బాలీవుడ్ నటి సన్నీ లియోన్ ఇంట రాఖీ పండుగ సందడి నెలకొంది. తన భర్త, పిల్లలు, కుటుంబ సభ్యులతో కలిసి ఈ పండగను సెలబ్రెట్ చేసుకుంది. దత్త కూతురు నిష, తన కవల సోదరులు రాఖీ కట్టిన ఫొటోనలు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. ఇద్దరు కుమారులు, కుమార్తెతో ఉన్న ఫొటోను సన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.
చదవండి: పంత్‌కు రీకౌంటర్ ఇచ్చిన ఊర్వశి, ‘కౌగర్ హంటర్’ అంటూ ఘాటు వ్యాఖ్యలు
‘అందరికీ సంతోషకరమైన రక్షా బంధన్ శుభాకాంక్షలు. నా కుటుంబాన్ని ప్రేమిస్తాను’ అంటూ ఆమె పోస్ట్ చేసింది. అలాగే సన్నీ తన స్నేహితుడైన రోహిత్ వర్మ, సెక్యూరిటీ సలహాదారు యూసుఫ్ ఇబ్రహీంకు రాఖీ కట్టిన ఫొటోలను కూడా పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటో నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అలాగే సన్నీ ఆమె ఫాలోవర్స్ రాఖీ శుభాకాంక్షలు చెబుతూ తన పోస్ట్‌పై రియాక్ట్ అవుతున్నారు.