
టాలీవుడ్‌లో తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల్లో గిలిగింతలు పెట్టించే నటుడు సునీల్. తెలుగులో హీరోగాను పలు సినిమాల్లో మెప్పించిన ఆయన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి పుష్పతో మళ్లీ స్పీడ్ పెంచాడు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సౌత్ ఇండియాలో బిజీగా ఉన్నారు. కోలీవుడ్‌లోనూ వరుస అవకాశాలు అందుకుంటున్నారు. ఈ క్రమంలో రజనీకాంత్ 'జైలర్', కార్తి 'జపాన్', విశాల్ 'మార్క్ అంథోని' చిత్రాల్లో విభిన్న పాత్రల్లో ఆయన మెప్పించాడు.

తాజాగా సునీల్ మలయాళ పరిశ్రమలో కూడా ఎంట్రీ ఇచ్చేశారు. అయితే, హాస్యనటుడిగా కాకుండా విలన్‌గా అతడు మాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు. 'భ్రమయుగం' తర్వాత మమ్ముట్టి లేటెస్ట్ మూవీ టర్బోలో సునీల్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన సునీల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.
సీరియస్ లుక్‌లో ఉన్న సునీల్.. టర్బో సినిమాలో ఆటో బిల్లా అనే క్యారెక్టర్‌లో కనిపించబోతున్నట్లు వెల్లడించాడు. ఇప్పటికే కోలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న సునీల్.. మాలీవుడ్‌లో కూడా తన సత్తా ఎంటో చూపించబోతున్నాడు. మే 23న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో మమ్ముట్టినే నిర్మించాడు. తన సొంత బ్యానర్‌లో టర్బో సినిమా రానున్నడంతో అభిమానుల్లో అంచనాలను పెంచేశాయి. ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానుంది.
Sunil as Auto Billa#Turbo in Cinemas Worldwide on May 23 , 2024 pic.twitter.com/DA4tjNUQbI
— Mammootty (@mammukka) May 17, 2024