Sudheer Babu's 'Hunt' Movie Release Date Out! - Sakshi
Sakshi News home page

రిపబ్లిక్‌ డే కానుకగా ‘హంట్‌’

Dec 31 2022 8:00 AM | Updated on Dec 31 2022 11:27 AM

Sudheer Babu Hunt Movie Release Date Out - Sakshi

సుధీర్‌బాబు హీరోగా, శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ ఫేమ్‌ భరత్‌ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ఫిల్మ్‌ ‘హంట్‌’. మహేశ్‌ దర్శకత్వంలో వి. ఆనందప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమాలో సుధీర్‌బాబు, శ్రీకాంత్, భరత్‌  పోలీసాఫీసర్లుగా నటించారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 26న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ శుక్రవారం ప్రకటించింది.

ఈ సందర్భంగా వి. ఆనంద ప్రసాద్‌ మాట్లాడుతూ – ‘‘రిపబ్లిక్‌ డే కానుకగా ‘హంట్‌’ సినిమాను జనవరి 26న థియేటర్స్‌లో రిలీజ్‌ చేస్తున్నాం. చిత్రీకరణతో పాటు పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ పూర్తయ్యాయి. మార్వెల్‌ స్టూడియోస్‌ నిర్మించిన పలు చిత్రాలకు పని చేసిన యాక్షన్‌ కొరియోగ్రాఫర్స్‌ రేనాడ్‌ ఫవెరో, బ్రయాన్‌ విజియార్‌ ‘హంట్‌’ సినిమాకు యాక్షన్‌ స్టంట్స్‌ కొరియోగ్రఫీ చేశారు. వాళ్లు డిజైన్‌ చేసిన యాక్షన్‌ సీక్వెన్స్‌ ఓ హైలైట్‌గా నిలుస్తుంది’’ అని అన్నారు. ఈ సినిమాకు సంగీతం: జిబ్రాన్, కెమెరా: అరుల్‌ విన్సెంట్, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: అన్నే రవి.

Advertisement
 
Advertisement
Advertisement