నాన్న నటించిన ఆ సినిమా అంటే చాలా ఇష్టం: మహేశ్ బాబు | Sudheer Babu and Mahesh Babu Phone Call Conversation Goes Viral | Sakshi
Sakshi News home page

Mahesh Babu: ఆ సినిమా కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకోలేదు: మహేశ్ బాబు

Published Wed, Jun 12 2024 3:41 PM | Last Updated on Wed, Jun 12 2024 4:04 PM

Sudheer Babu and Mahesh Babu Phone Call Conversation Goes Viral

టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు ప్రస్తుతం 'హరోం హర' మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో మాళవిక శర్మ  హీరోయిన్‌గా కనిపించనుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్, అడివి శేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

అయితే ఈ ఈవెంట్‌లో ఓ ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది.  మహేశ్‌ బాబుతో సుధీర్ బాబు మాట్లాడిన ఫోన్‌ రికార్డ్‌ ఆడియోను ప్లే చేశారు. వీరి మధ్య దాదాపు ఐదు నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. సుధీర్ బాబు అడిగిన పలు ప్రశ్నలకు మహేశ్ బాబు సమాధాలిచ్చారు. మొదటిసారి గన్‌ వాడినప్పుడు మీకు ఎలా అనిపించింది? అని సుధీర్ ప్రశ్నించగా.. టక్కరి దొంగ సినిమాలో ఎక్కువసార్లు గన్స్ వాడా.. కానీ గన్‌ కాల్చేందుకు ప్రత్యేకంగా శిక్షణ తీసుకోలేదని మహేశ్ అన్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో మోసగాళ్లకు మోసగాడు గుర్తొచ్చింది.

గన్స్‌ చూపించే సినిమాల్లో మీకు నచ్చిన చిత్రమేది అని సుధీర్ బాబు అడిగాడు. నాన్న గారు నటించిన మోసగాళ్లకు మోసగాడు సినిమాను వందసార్లు చూశానని మహేశ్ అన్నారు. హరోంహరలో నీకు బాగా నచ్చిన పాట ఏదని అడగ్గా.. టైటిల్‌ సాంగ్ అని మహేశ్ ఆన్సరిచ్చారు. హరోంహర ట్రైలర్‌లో నీకు నచ్చిన అంశాలు ఏంటి? అని సుధీర్ ప్రశ్నించాడు. ఈ సినిమాలో నువ్వు చాలా కొత్తగా ఉన్నావ్‌.. ఇలాంటి కథ ఇప్పటివరకు రాలేదనిపించింది.. అని మహేశ్ బాబు అన్నారు. మీరు నటించిన నిజం సినిమా గురించి ఆసక్తికర విషయాలు ఏమైనా ఉన్నాయా? అని సుధీర్ బాబు అడిగారు. నిజం చాలా నచ్చిన సినిమా అది. అలాంటి గొప్ప చిత్రాన్ని నాకు అందించినందుకు దర్శకుడు తేజకు థ్యాంక్స్‌.  నా సినిమాల్లో నిజం ఒక ఫెవరేట్‌ ఫిల్మ్ అని మహేశ్ బాబు అన్నారు. కాగా.. సుధీర్ బాబు నటించిన హరోం హర జూన్ 14 థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా మహేశ్ బాబు హరోం హర పెద్ద హిట్ అవ్వాలని.. ఆల్ ది బెస్ట్‌ చెప్పారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement