
ఇప్పుడంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. అందుకు తగ్గట్లే ఇతర భాషల్లో హిట్టయిన సినిమాల్ని మన దగ్గర డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. లేదంటే నేరుగా ఓటీటీల్లో స్ట్రీమింగ్‌లోకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు అలానే కన్నడలో ఈ మధ్యనే రిలీజ్ అదిరిపోయే రెస్పాన్స్ అందుకున్న ఓ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో రిలీజ్ చేస్తోంది. తాజాగా ఈ విషయమై అప్‌డేట్ ఇచ్చారు.
వచ్చే వారం థియేటర్లలో వార్ 2, కూలీ చిత్రాలు రాబోతున్నాయి. కాబట్టి కన్నడ హిట్ మూవీ 'సు ఫ్రమ్ సో'ని ఈ వారమే (ఆగస్టు 08) థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఎలా ఉంది?
(ఇదీ చదవండి: ఓటీటీ ట్రెండింగ్‌లో తెలుగు హారర్ సినిమా)
'సు ఫ్రమ్ సో' అనేది విలేజ్ బ్యాక్‌డ్రాప్ హారర్ కామెడీ మూవీ. అసలు విషయానికొస్తే.. తీర ప్రాంతంలో ఉన్న ఓ ఊరిలో అశోక్ అనే కుర్రాడు ఆవారాగా తిరుగుతుంటాడు. అతడు సులోచన అనే దెయ్యాన్ని ప్రేమిస్తున్నాడనే పుకార్లు ఊరంతటా వ్యాపిస్తాయి. ఆ తర్వాత ఊరిలో కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతాయి. ఇంతకీ వీటన్నింటికీ కారణమేంటి? సులోచన దెయ్యం నిజమేనా? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.
ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన జేపీ తుమినాడ్.. దర్శకత్వం కూడా వహించాడు. స్టోరీ కూడా అతడిదే. ప్రముఖ కన్నడ హీరో కమ్ దర్శకుడు రాజ్ బి శెట్టి.. ఓ నిర్మాతగా వ్యవహరించాడు. కన్నడలో హిట్ కొట్టిన ఈ చిత్రం తెలుగులో ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి?
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 37 సినిమాలు)