Director SS Rajamouli Shocking Decision On RRR Movie Release Date - Sakshi
Sakshi News home page

‘ఆర్ఆర్‌ఆర్‌’ రిలీజ్‌ డేట్‌పై రాజమౌళి సంచలన నిర్ణయం!

Jun 8 2021 9:36 AM | Updated on Jun 8 2021 11:09 AM

SS Rajamouli Stunning Decision On RRR Movie Release Date - Sakshi

దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ల భారీ మల్టీస్టారర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఈ మూవీని ప్రకటించినప్పటి నుంచి ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఇక దీని నుంచి వచ్చిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్లు‌, టీజర్లతో ఆర్‌ఆర్‌ఆర్‌పై భారీ స్థాయిలో హైప్‌ క్రియేట్‌ అయ్యింది. షూటింగ్‌ చివరి షెడ్యూల్‌ను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 13న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగిపోయింది. విడుదల తేదీ ఎప్పుడేప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నా అభిమానులకు ఈ తాజా బజ్‌తో  నిరాశే ఎదురైంది.

తాజా సమాచారం ప్రకారం.. ఆర్‌ఆర్‌ఆర్‌ విడుదల ఇంకా ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతీ కారణంగా మూవీ షూటింగ్‌ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇంకా క్లైమాక్స్‌ సన్నివేశాలతో పాటు కీలక యాక్షన్‌ సీన్ల చిత్రీకరించాల్సి ఉందట, దీనికి ఇంకా ఎక్కువ సమయం పడుతుందని సమాచారం. దీంతో ముందుగా అనుకున్న డేట్‌కు ఆర్‌ఆర్‌ఆర్‌ను విడుదల చేయడం కుదరదని, మరోసారి విడుదల తేదీ మార్పుపై చర్చలు జరుగుతున్నట్లు టాలీవుడ్‌ వర్గాల్లో వినికిడి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది 2022 ఏప్రిల్ 28న విడుదల చేస్తే బాగుంటుందని రాజమౌళి సూచించినట్లు సమాచారం.

మిగిలిన షూటింగ్‌కు, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఇంకా 6 నెలల సమయం పడుతుందని, అందుకే 2022 సమ్మర్‌కు విడుదల చేస్తే బాగుంటుందని మేకర్స్‌ కూడా భావిస్తున్నట్లు సమాచారం. కాగా జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు అలరించనున్నాడు. ఇక బాలీవుడ్‌ నటుడు అజయ్ దేవ్ గన్ కీలక పాత్ర పోషిస్తుండటంతో ఈ మూవీపై బీ-టౌన్‌లో కూడా మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన బిజినెస్ వ్యవహారం కూడా పూర్తయ్యింది. బాహుబలి కంటే హై రేంజ్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి అన్ని వైపుల నుంచి కూడా పెట్టిన పెట్టుబడికి ఈజీగా ప్రాఫిట్స్ అందించగలదని అనుకుంటున్నారు. ఈ సినిమా దాదాపు 900కోట్ల వరకు బిజినెస్ చేస్తున్నట్లు కథనాలు వచ్చిన విషయం తెలిసిందే.

చదవండి: 
RRR Movie: ఫైట్‌ సీన్‌కి కన్నీళ్లొస్తాయి! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement