టిల్లు స్క్వేర్‌లో శ్రీసత్య.. సీన్స్‌ డిలీట్‌ చేశారా? | Is Sri Satya Scenes Deleted in Siddhu Jonnalagadda Tillu Square Movie? | Sakshi
Sakshi News home page

టిల్లు స్క్వేర్‌: శ్రీసత్యకు అన్యాయం! సిద్ధుతో నటించిన సీన్స్‌ ఎక్కడ?

Apr 2 2024 11:45 AM | Updated on Apr 2 2024 1:36 PM

Is Sri Satya Scenes Deleted in Siddhu Jonnalagadda Tillu Square Movie? - Sakshi

టిల్లు స్క్వేర్‌లో మంచి పాత్ర చేస్తున్నట్లు తెలిపింది. సిద్ధు జొన్నలగడ్డతో మంచి సన్నివేశాలున్నాయని, ప్రాధాన్యత ఉన్న పాత్ర చేస్తున్నానంది. డైలాగ్స్‌ చెప్పేటప్పుడు మొ

తల్లిని మించి దైవమున్నదా...? శ్రీసత్య కూడా ఇదే అనుకుంది. తనను కనిపెంచిన అమ్మ మంచాన పడి ఉంటే తట్టుకోలేకపోయింది. ఎవరినో ప్రేమించి, మోసపోయిన శ్రీసత్య చావు అంచులదాకా వెళ్లి తల్లి కోసం బతికొచ్చింది. అమ్మకు మంచి వైద్యం చేయించాలనుకుంది. అందుకనే సీరియల్స్‌, షోలు, వెబ్‌ సిరీస్‌లు.. ఏవి వచ్చినా చేసుకుంటూ పోయింది. అలా బిగ్‌బాస్‌ అవకాశాన్ని కూడా వాడుకుంది.

హీరోతో సీన్స్‌ ఉన్నాయ్‌
తెలుగు బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌లో పాల్గొంది. తర్వాత పెద్దగా కనిపించడమే లేదు. మొన్నామధ్య ఓ ఇంటర్వ్యూకు హాజరైన బ్యూటీ.. టిల్లు స్క్వేర్‌లో మంచి పాత్ర చేస్తున్నట్లు తెలిపింది. సిద్ధు జొన్నలగడ్డతో మంచి సన్నివేశాలున్నాయని, ప్రాధాన్యత ఉన్న పాత్ర చేస్తున్నానంది. డైలాగ్స్‌ చెప్పేటప్పుడు మొదటిరోజు కాస్త టెన్షన్‌ పడ్డానని, తర్వాత మామూలుగా చెప్పేశానంది. కట్‌ చేస్తే నాలుగు రోజుల క్రితమే టిల్లు స్క్వేర్‌ రిలీజైంది.

సినిమా మొత్తం మీద..
సినిమాలో ఒక పాట మినహా ఎక్కడా శ్రీసత్య కనిపించలేదు. ఆ పాటలో కూడా బ్యాగ్రౌండ్‌ డ్యాన్సర్లలో ఒకరిగా సెకనుపాటు మెరిసిందంతే! అంటే శ్రీసత్య సీన్లు డిలీట్‌ చేశారని అర్థమవుతోంది. ఇది చూసిన అభిమానులు శ్రీసత్యకు అన్యాయం చేశారని ఫీలవుతున్నారు. సిద్ధు- శ్రీసత్యల సన్నివేశాలు ఉంచాల్సిందని అభిప్రాయపడుతున్నారు.

చదవండి: 'జనతా గ్యారేజ్‌' నటుడితో అనుశ్రీ డేటింగ్‌..ఒత్తిడిలో హీరోయిన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement