పాన్‌ గ్లోబ్‌ సాంగ్‌.. 'సూళ్లే బాకు'ను రిలీజ్‌ చేసిన తనికెళ్ల భరణి | Soolle Baku Song Out From Dochevaarevarura Movie | Sakshi
Sakshi News home page

Dochevaarevarura: తనికెళ్ల భరణి చేతుల మీదుగా 'సూళ్లే బాకు' సాంగ్‌ రిలీజ్‌

Jun 6 2022 9:51 AM | Updated on Jun 6 2022 11:10 AM

Soolle Baku Song Out From Dochevaarevarura Movie - Sakshi

సస్పెన్స్‌, కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. కథ మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలో నేను రాసిన ‘సూళ్ళే బాకు..’ పాన్‌ గ్లోబ్‌ సాంగ్‌ని తనికెళ్ల భరణిగారు రిలీజ్‌ చేయడం సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘

ప్రణవ చంద్ర, మాళవిక జంటగా శివ నాగేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దోచేవారెవరురా’. ఐక్యూ క్రియేషన్స్‌ పతాకంపై బొడ్డు కోటేశ్వరరావు నిర్మించారు. శనివారం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా ఈ చిత్రంలోని ‘సూళ్ళే బాకు..’ అనే లిరికల్‌ వీడియో సాంగ్‌ని రచయిత, నటుడు తనికెళ్ల భరణి విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘మంచి కాన్సెప్ట్‌తో రూపొందిన ‘దోచేవారెవరురా’ సినిమాలు ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరం. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలి’’ అన్నారు.

దర్శకుడు శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్‌, కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. కథ మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలో నేను రాసిన ‘సూళ్ళే బాకు..’ పాన్‌ గ్లోబ్‌ సాంగ్‌ని తనికెళ్ల భరణిగారు రిలీజ్‌ చేయడం సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘జూలై చివరి వారంలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు బొడ్డు కోటేశ్వర రావు. ఈ కార్యక్రమంలో ప్రణవ, మాళవిక, పాటల రచయితలు చంద్రబోస్, సిరాశ్రీ, నటీనటులు సునయన, అజయ్‌ ఘోష్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: అర్లి, సంగీతం: రోహిత్‌ వర్ధన్‌.

చదవండి: విరాటపర్వం ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో అపశ్రుతి
హోటల్‌కు తీసుకెళ్లి ముద్దులతో ముంచెత్తాడు, అప్పుడే..

Advertisement
 
Advertisement
Advertisement