భార్య బర్త్‌డే, ఎమోషనల్‌ పోస్ట్‌ షేర్‌ చేసిన సోనూసూద్‌ | Sonu Sood Wishes On His Wife Sonali Birthday With Emotional Post | Sakshi
Sakshi News home page

Sonu Sood: సోనూసూద్‌ భార్య బర్త్‌డే, నువ్వే నా ధైర్యమంటూ నటుడు భావోద్వేగం

Dec 4 2021 4:18 PM | Updated on Dec 4 2021 4:26 PM

Sonu Sood Wishes On His Wife Sonali Birthday With Emotional Post - Sakshi

లాక్‌డౌన్‌లో ఎంతో మంది కార్మికులకు, పేద ప్రుజలకు సాయం చేసి అండగా నిలిచిన రియల్‌ హీరో, సినీ నటుడు సోనూసూద్‌ సోషల్‌ మీడియా వేదికగా భావోద్వేగానికి లోనయ్యారు. ఈ రోజు ఆయన భార్య సోనాలి పుట్టిన రోజు. ఈ సందర్భంగా సోనూసూద్‌ ఆమెకు విషెస్‌ తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్‌ పోస్ట్‌ షేర్‌ చేశారు. ఈ మేరకు భార్యపై ప్రేమ కురిపిస్తూ పెట్టిన ఈ పోస్ట్‌ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. 

చదవండి: అత్యంత డేంజర్‌ లుక్‌లో అనసూయ.. భర్తనే చంపేస్తుందట, ఇదిగో ప్రూఫ్‌

ఇంతకి ఆ పోస్ట్‌లో సోనూసూద్‌ ఏమని రాసుకొచ్చారంటే.. ‘హ్యాపీ బర్త్‌డే మై జాన్‌. నా జీవితాన్ని పరిపూర్ణం చేసినందుకు ధన్యవాదాలు. నా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి నాకు పిల్లర్‌లా నిలుస్తూ ధైర్యాన్ని ఇచ్చావు, మంచి స్నేహితురాలిగా అడ్వైజ్‌లు ఇస్తావు, ఎన్నో విషయాల్లో స్ఫూర్తినిచ్చావు. నేను చెప్పే ప్రతి మాట వింటావు.. లవ్‌ యూ’ అంటూ రెండు రెడ్‌ హార్ట్‌ ఏమోజీలను జత చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది.

చదవండి: తన ఫ్రెండ్‌ ట్రాన్స్‌జెండర్‌తో ఉపాసన, సోదరి పెళ్లి వేడుకలకు ఆహ్వానం

ఇక సోనూసూద్‌ పోస్ట్‌పై బాలీవుడ్‌కు చెందిన నటీనటులు తమదైన శైలిలో స్పందిస్తూ సోనాలికి బర్త్‌డే విషెస్‌ తెలుపుతున్నారు. కాగా లాక్‌డౌన్‌లో ఎంతో మంది పేద ప్రజలకు, ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన కార్మికులు సోనూసూద్‌ తన  సొంత ఖర్చులతో వారి వారి రాష్ట్రాలకు తరలించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరం సేవ కార్యక్రమాలు చేస్తూ అందరి చేతి రియల్‌ హీరోగా నీరాజనాలు అందుకుంటున్నారు సోనూసూద్‌.

Advertisement
 
Advertisement
Advertisement