Sonakshi Sinha: ఎంగేజ్‌మెంట్‌ వార్తలపై క్లారిటీ ఇచ్చిన సోనాక్షి సిన్హా

Sonakshi Sinha Clarifies On Her Engagement Rumours - Sakshi

బాలీవుడ్‌ బ్యూటీ సోనాక్షి సిన్హా ఎంగేజ్‌మెంట్‌ చేసుకుందంటూ ఇటీవల వార్తలు వినిపించాయి. రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫొటోలు షేర్‌ చేస్తూ తన వేలికి ఉన్న డైమండ్‌ రింగ్‌ హైలెట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫొటోలకు ‘ఇది నాకు బిగ్‌ డే.. ఈరోజు నాకున్న పెద్ద కల నెరవేరబోతోంది, దాన్ని మీతో పంచుకునేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాను. ఇది జరిగిందంటే నమ్మలేకపోతున్నాను’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది.

చదవండి: బాలీవుడ్‌పై మహేశ్‌ కామెంట్స్‌, స్పందించిన బోనీ కపూర్‌, ఆర్జీవీ

అంతేకాదు ఈ ఫొటోలో ఓ వ్యక్తి  పక్కనే నిలుచుని అతడు కనపబడకుండా జాగ్రత్త పడింది. దీంతో సోనాక్షి సింగిల్‌ లైప్‌ ఫుల్‌స్టాప్‌ పెట్టి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబతోందంటూ ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. దీంతో అదే నిజమనుకున్నారు నెటిజన్లు, ఫ్యాన్స్‌. ఈ క్రమంలో తాజాగా తన ఎంగేజ్‌మెంట్‌ వార్తలపై క్లారిటీ ఇచ్చింది సోనాక్షి. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెడుతూ.. మిమ్మల్ని బాగా ఆటపిట్టించానని అనుకుంటున్నాను అంటూ కామెంట్‌ చేసింది. 

చదవండి: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ చాలా ప్రాబ్లమ్స్‌లో ఉంది: అల్లు అరవింద్‌

‘ఒకే ఒకే.. నేను మిమ్మల్ని బాగా ఆటపట్టించానని అనుకుంటున్నా. నేను ఒక్క అబద్దం కూడా చెప్పకుండ మీకు ఎన్నో క్లూలు ఇచ్చాను. అవును నేను చెప్పినట్లుగా ఆ రోజు నాకు బిగ్‌డే.. ఎందుకంటే నా సొంత నెయిల్‌ పాలిష్‌ బ్రాండ్‌ సోయిజీని ప్రారంభించే రోజు నాకు గొప్ప రోజే. అందమైన నెయిల్స్‌ కోసం ప్రతి అమ్మాయికి ఇదే చివరి గమ్మం అవుతుంది. నేను వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి నా బిగ్గేస్ట్‌ డ్రీమ్‌ను నిజం చేసుకున్న. ఈ విషయాన్ని మీతో పంచుకోకుండా ఉండలేకపోయాను. సోయిజీ నెయిల్‌ పాలిష్‌ వేసుకున్న పిక్స్‌తో చివరిగా నా ప్రేమను పంచుకున్న. మీరు ఏమనుకున్నారు? హాహ్హాహ్హా.. లవ్‌ యూ గాయ్స్‌! మీరు ఇచ్చిన సపోర్ట్‌కు థ్యాంక్స్‌’ అని రాసుకొచ్చింది. ఇక సోనాక్షి తీరుకు కొంతమంది నెటిజన్లు మండిపడుతుండగా మరికొందరు కొత్తగా బిజినెస్‌లోకి అడుగుపెట్టిన తనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top