Allu Aravind: బాలీవుడ్‌ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది

Allu Aravind Talk About Indian Cinema At Ashoka Vanam Lo Arjuna Kalyanam - Sakshi

Allu Arvind About Indian Cinema, Movie Industries: ప్రస్తుతం భారత సినీ పరిశ్రమ చాలా ప్రాబ్లమ్స్‌లో ఉందని నిర్మాత అల్లు అరవింద్‌ అన్నారు. ఎంత పెద్ద స్టార్‌ హీరోల సినిమాలు విడుదలైన ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా రీసెంట్‌గా విడుదలైన యంగ్‌ హీరో విశ్వక్‌సేన్‌ ‘అశోకవనంలో అర్జుణ కళ్యాణం’ మూవీ సెక్సెస్‌ మీట్‌ నిన్న నిర్వహించారు. ఈ వెంట్‌కు ఆయన ముఖ్య అథితిగా వచ్చారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్‌ మాట్లాడుతూ.. ఈ సినిమా తాను కూడా చూశానని, చాలా బాగుందని చెప్పారు. 

చదవండి: స్టార్‌ హీరో సల్మాన్‌కు వింత వ్యాధి.. ‘ఆత్మహత్య చేసుకోవాలనిపించేది’

అనంతరం ‘గతంలో కుటుంబం మొత్తం థియేటర్‌కు వచ్చి సినిమాలు చూసేవారు. ప్రస్తుతం థియేటర్లకు వచ్చి సినిమా చూసే అలవాటు పోయింది. శని, ఆదివారాలు వస్తే భార్య, భర్తతో ఏ సినిమాకు వెళ్దామండి అని అడిగేవారు. కానీ ఇప్పుడు ఆ కల్చర్‌ కనిపించడం లేదు. ఓటీటీలు వచ్చాక అది పూర్తిగా మారింది. సినిమా విడుదలయ్యాక ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూసే కాలం వచ్చింది’ అన్నారు. ​కేవలం కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకులను థియేటర్లోకి రప్పిస్తున్నాయని ఆయన పేర్కొ​న్నారు. 

చదవండి: నయనతార పెళ్లిపై ప్రముఖ ఆస్ట్రాలజర్‌ సంచలన వ్యాఖ్యలు

‘ఒకప్పుడు ఎలాంటి హీరో సినిమా అయినా చూసేందుకు ప్రేక్షకులు థియేటర్‌కు వచ్చేవాడు. కానీ ఇప్పుడు పెద్ద హీరో సినిమా అయిన ప్రేక్షకులు అంత థియేటర్లకు రావడం లేదు. దీనికంతటికి కారణం ఇండియన్‌ మూవీ ఇండస్ట్రీలో చాలా మరడమే. ఇప్పటికైన ఇలాంటి డేంజరస్‌ ట్రెండ్‌ నుంచి మనం బయటపడాలి. అంటే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ సినిమాలు తీస్తేనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. ఇప్పటికైన ఇండస్ట్రీ అది గ్రహించారు. ప్లిజ్‌ మీరందరు సినిమాకు వచ్చి చూస్తేనే ఈ సినిమాలు బ్రతకుతాయి’ అని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు. ఇక బాలీవుడ్ పరిస్థితి అయితే మరి దారుణంగా ఉందని, అక్కడి స్టార్లు నటించిన చిత్రాలు కనీస ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోతున్నాయని అల్లు అరవింద్‌ వ్యాఖ్యానించారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top