Ram Gopal Varma and Boney Kapoor Reacts on Mahesh Babu Comments on Bollywood - Sakshi
Sakshi News home page

Boney Kapoor-RGV: ‘నటుడిగా అది తన వ్యక్తిగత అభిప్రాయం.. తప్పేముంది’

May 12 2022 3:32 PM | Updated on May 13 2022 2:03 PM

Ram Gopal Varma And Boney Kapoor Reacts On Mahesh Babu Comments On Bollywood - Sakshi

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు బాలీవుడ్‌పై చేసిన కామెంట్స్‌ ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఇటీవల జరిగిన మేజర్‌ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ మహేశ్‌ మాట్లాడుతూ.. బాలీవుడ్‌ తనని భరించదని, అందుకే అక్కడ సినిమాలు చేసి సమయం వృధా చేసుకొనని చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో మహేశ్‌ వ్యాఖ్యలు బాలీవుడ్‌, టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా నిలిచాయి. ఈ నేపథ్యంలో ఆయన కామెంట్స్‌ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌ స్పందించాడు. మహేశ్‌ వ్యాఖ్యలపై తన అభిప్రాయం చెప్పమని బోనీ కపూర్‌ను ఓ అంగ్ల మీడియా కోరింది.

చదవండి: బాలీవుడ్‌ పరిస్థితి అయితే మరి దారుణంగా ఉంది: అల్లు అరవింద్‌

దీనికి ఆయన స్పందిస్తూ.. ‘మహేశ్‌ వ్యాఖ్యలపై స్పందించడానికి నేను కరెక్ట్‌ పర్సన్‌ కాదు. నేను ఉత్తరాదితో పాటు దక్షిణాదికి కూడా చెందిన వాడిని. ఇప్పటికే తెలుగు, తమిళంలో సినిమాలు నిర్మించాను. త్వరలోనే కన్నడ, మలయాళంలో కూడా తీయబోతున్నా. కాబట్టి నేను ఈ విషయంలో ఎలాంటి కామెంట్స్‌ చేయలేను. తనకు ఏది అనిపిస్తే అది మాట్లాడే హక్కు మహేశ్‌కు ఉంది. బాలీవుడ్‌ తనని భరించలేదని అతను అనుకుని ఉండోచ్చు. అలా చెప్పడానికి తన దగ్గర తగిన కారణాలు కూడా ఉండిఉంటాయి. ఎవరి అభిప్రాయం వారిది’ అని ఆయన చెప్పుకొచ్చాడు.

చదవండి: ఆడియన్స్‌కు ‘సర్కారు వారి పాట’ టీం విజ్ఞప్తి

అలాగే వివాదస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ కూడా మహేశ్‌ కామెంట్స్‌పై స్పందించాడు. ఓ అంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో వర్మ మాట్లాడుతూ.. ‘మహేశ్‌ వ్యాఖ్యలను తప్పుబట్టడానికి లేదు. ఎందుకంటే ఎక్కడ సినిమాలు చేయాలి, ఎలాంటి కథలు  ఎంచుకోవాలన్నది నటుడిగా తన సొంత నిర్ణయం’ అన్నాడు. ఇక బాలీవుడ్‌ తనని భరించలేదంటూ మహేశ్‌ చేసిన వ్యాఖ్యలు తనకు అర్థం కాలేదన్నాడు. బాలీవుడ్‌ అనేది కేవలం ఒక సంస్థ కాదని, మీడియా వాళ్లే ఆ పేరు సృష్టించారని వర్మ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement