సల్మాన్‌ ఖాన్‌ కోడలిగా హీరోయిన్‌ సోనాక్షి సిన్హా! | Sonakshi Sinha To Become Salman Khan Bahu | Sakshi
Sakshi News home page

Sonakshi Sinha: సల్మాన్‌ ఖాన్‌ కోడలిగా సోనాక్షి సిన్హా!

Nov 27 2021 8:43 PM | Updated on Nov 27 2021 9:11 PM

Sonakshi Sinha To Become Salman Khan Bahu - Sakshi

మరో హీరోయిన్‌ సోనాక్షి సిన్హ కూడా ఈ జాబితాలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ ఇంటికి కోడలిగా వెళ్లనున్నట్లు తెలుస్తోంది...

Sonakshi Sinha Wedding: ఎప్పుడూ సినిమా సినిమా అంటూ కెరీర్‌పై ఫోకస్‌ పెట్టే బాలీవుడ్‌ సెలబ్రిటీలు ఈ మధ్య వ్యక్తిగత విషయాల మీద కూడా దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు స్టార్‌ జంటలు పెళ్లికి సిద్ధమవుతున్నాయి. ఇటీవల బాలీవుడ్‌ తారలు రాజ్‌కుమార్‌ రావు-పత్రలేఖలు, అనుష్క రంజన్‌- ఆదిత్య సీల్‌ పెళ్లిపీటలెక్కగా తర్వలో విక్కీ కౌశల్‌, కత్రినా కైఫ్‌ వైవాహిక బంధంలో అడుగుపెట్టనున్నారు. రణ్‌బీర్‌ కపూర్‌, అలియాభట్‌ కూడా త్వరలోనే షాదీ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా మరో హీరోయిన్‌ సోనాక్షి సిన్హ కూడా ఈ జాబితాలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ ఇంటికి కోడలిగా వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

గత కొంత కాలంగా సెలబ్రిటీల మేనేజర్‌ బంటి సచ్‌దేవ్‌తో సోనాక్షి డేటింగ్‌ చేస్తోందట. మూడు, నాలుగేళ్లుగా వీరు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ పలుమార్లు మీడియా కంట పడ్డారట! తాజాగా వీరు తమ బంధాన్ని మరోమెట్టు ఎక్కించేందుకు సిద్ధమవుతున్నట్లు బాలీవుడ్‌ మీడియా కోడై కూస్తోంది. ఇక బంటి సచ్‌దేవ్‌ సల్మాన్‌కు ఎలా సన్నిహితుడంటే.. సల్మాన్‌ సోదరుడు సోహైల్‌ ఖాన్‌.. అతడి భార్య సీమాఖాన్‌ సోదరుడే బంటి సచ్‌దేవ్‌. కాగా సోనాక్షి.. సల్మాన్‌ నటించిన 'దబాంగ్‌' చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

చదవండి: ఆ జాకెట్‌ వేసుకున్నా వేసుకోనట్లే ఉంది, అంత అవసరమా?

Advertisement
 
Advertisement
Advertisement