TV Actress Nia Sharma Gets Brutally Trolled for Wearing Plunging Neckline Blouse - Sakshi
Sakshi News home page

Nia Sharma: ఇంకెందుకో జాకెట్‌ వేసుకోవడం? నటిపై ట్రోలింగ్‌

Nov 25 2021 8:38 PM | Updated on Nov 26 2021 12:27 PM

TV Actress Nia Sharma Gets Brutally Trolled for Wearing Plunging Neckline Blouse - Sakshi

'ఇదేం పాడు డ్రెస్‌, మరీ అలాంటి దరిద్రపు జాకెట్‌ ఎలా వేసుకోవాలనిపించింది?' 'ఎదను కప్పుకోవడానికే జాకెట్‌ ధరిస్తారు, మరీ అలా ఎక్స్‌పోజింగ్‌ చేసే జాకెట్‌..

Nia Sharma Gets Trolled: సోషల్‌ మీడియా వచ్చాక సెలబ్రిటీలను టార్గెట్‌ చేయడం సర్వసాధారణమైపోయింది. వారి కట్టూబొట్టూ దగ్గర నుంచి మాటతీరు, నడత ఇలా అన్నింటినీ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. నచ్చకపోతే తిట్లదండకం కూడా అందుకుంటున్నారు. తాజాగా బుల్లితెర నటి నియా శర్మ డ్రెస్సింగ్‌ నచ్చకపోవడంతో నెటిజన్లు ఆమెను ఓ రేంజ్‌లో ఆడుకున్నారు.

నియా పార్టీవేర్‌ డ్రెస్‌లో హొయలు పోతున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌చేసింది. వేలికి రింగు, మెడకు నెక్లెస్‌తో గ్లామర్‌ లుక్‌లో కనిపించిన నియా జారిపోతున్నట్లుగా ఉన్న బ్లౌజు ధరించింది. ఇది చాలామంది నెటిజన్లకు అస్సలు నచ్చలేదు. 'ఆ బ్లౌజు వేసుకున్నా వేసుకోనట్లే ఉంది', 'ఇదేం పాడు డ్రెస్‌, మరీ అలాంటి దరిద్రపు జాకెట్‌ ఎలా వేసుకోవాలనిపించింది?' 'ఎదను కప్పుకోవడానికే జాకెట్‌ ధరిస్తారు, మరీ అలా ఎక్స్‌పోజింగ్‌ చేసే జాకెట్‌ ధరించడమెందుకో' అని కామెంట్లు చేస్తున్నారు. ఇదేం బాగోలేదంటూ కొందరు అభిమానులు సైతం నిరుత్సాహపడుతూ కామెంట్లు చేశారు. అయితే ఇలా ట్రోలింగ్‌కు గురవడం నియాకు కొత్తేమీ కాదు. పొట్టి దుస్తులు ధరించిన పలు సందర్భాల్లోనూ ఈ నటి విమర్శలపాలైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement